Tuesday, October 28, 2025 07:24 AM
Tuesday, October 28, 2025 07:24 AM
roots

టీడీపీలో రగిలిపోతున్న అసంతృప్తులు…!

ఐదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన సంతోషం పట్టుమని ఐదు నెలలు కూడా నిలవటం లేదు. ఇప్పటికే పార్టీలో కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరికొందరేమో సైలెంట్‌ అయిపోగా… ఇంకొందరు వేరే దార్లు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఇదంతా నామినేటెడ్ పోస్టుల వల్ల వచ్చిన ప్రకంపనలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడిన నేతలంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై గంపెడంత ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు.

Also Read: తెగించిన నీలి మీడియా.. మళ్ళీ ఫేక్ ప్రచారం

ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి టార్గెట్ కూడా అయ్యారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా చేసింది జగన్ సర్కార్. ఇక మహిళా నేతల పరిస్థితి అయితే మరీ దారుణం. సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యంగా చిత్రీకరించడం.. రాయలేని భాషలో కించపరిచేలా తెగ ట్రోల్ కూడా చేశారు వైసీపీ అభిమానులు. అయితే ఇవన్నీ తట్టుకున్న నేతలు పార్టీ గెలుపు కోసం ధీటుగా పని చేశారనేది వాస్తవం. ఇదంతా 2024 జూన్ 4కు ముందు.

Also Read: డీలా పడ్డ వైసీపీ శ్రేణులు.. కారణం ఏంటంటే..?

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత… పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంకా చెప్పాలంటే దెబ్బలు తిన్న నేతలకు ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు ఇవ్వటం లేదనే అపవాదు మూటగట్టుకుంటున్నారు అధినేత చంద్రబాబు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు పట్టాభి, జీవీ రెడ్డి, ఆనం వెంకట రమణారెడ్డి, ప్రొ.తిరునగరి జ్యోత్స్న వంటి నేతలు నామినేటెడ్ పోస్టులపై గంపెడంత ఆశ పెట్టుకున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవి వస్తుందని జీవీ రెడ్డి, పట్టాభి, ఆనం వెంకట రమణారెడ్డి ఆశించారు. అలాగే టీటీడీ బోర్డు సభ్యురాలిగా అవకాశం వస్తుందని జ్యోత్స్నకు పార్టీ నేతలే స్వయంగా ఫోన్ చేసి మరీ ఆశపెట్టారు.

Also Read: చంద్రబాబు ఇంటికి వైసీపీ బిగ్ ఫిష్

అయితే ఈ ముగ్గురికి చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. తొలి జాబితాలోనే పట్టాభి పేరు ఉంటుందని అంతా భావించారు. కానీ అది జరగకపోగా… ఐదేళ్లు రకరకాల పదవులు అనుభవించిన వారికే మళ్లీ నామినేటెడ్ పోస్టు వరించింది. పట్టాభి అసంతృప్తితో ఉన్నాడనే విషయం గుర్తించిన చంద్రబాబు స్వయంగానే బహిరంగ వేదికపై న్యాయం చేస్తా అని హామీ ఇచ్చారు. జీవీ రెడ్డి కూడా కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారు. ఇక టీటీడీ బోర్డు ప్రకటన వచ్చిన తర్వాత జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయినట్లు తెలుస్తోంది.

Also Read: జగన్ పాపాలన్నీ బయటపెట్టిన తల్లి విజయమ్మ

ఇక పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రొద్దుటూరు డా.ప్రవీణ్ కుమార్ రెడ్డి, దేవినేని ఉమా, గుండ లక్ష్మీదేవి, కలమట వెంకటరమణ, కిమిడి నాగార్జున, ఆచంట సునీత, సుగుణమ్మ వంటి నేతలంతా నామినేటెడ్ పోస్టుల సెకండ్ లిస్టు కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో పేరు లేకపోతే… ఇక పార్టీకి కూడా గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి అసంతృప్తులను చంద్రబాబు ఎలా బుజ్జగిస్తారో చూడాలి. పదవులు ఇవ్వకపోయినా పర్లేదు.. కనీసం పిలిచి మాట్లాడే దిక్కు కూడా పార్టీలో లేదు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అసంతృప్తిని పార్టీ అధిష్టానం ఎలా సర్దుబాటు చేస్తుందో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్