వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా… రాడా… ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తాడని కొందరు… అలా ఏం లేదు.. అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణంరాజు స్పీకర్ స్థానంలో ఉన్నంతవరకు జగన్ అసెంబ్లీలో కాలు కూడా పెట్టడు… కావాలంటే రూ.11 పందెం అంటూ సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పేలుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ నేతలే ఇప్పుడు జగన్‌పై గుర్రుగా ఉన్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించకుండా ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందా అని విమర్శిస్తున్నారు.
మరోవైపు కొత్తగా ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇక అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే… వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి రావాలంటే ఓ చిట్కా ఉందంటూ కొందరు టీడీపీ నేతలే సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీ సెషన్ ప్రారంభానికి ముందు ప్రాంగణంలో నేతలు పిచ్చాపాటి మాట్లాడుకోవడం సర్వ సాధారణం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ నేతలు కూడా సరదాగా మాట్లాడిన సందర్భాలున్నాయి.
Also Read : ఘనంగా ఏపి కాకతీయ సేవా సమాఖ్య నూతన కమిటీ ఎన్నిక
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు కనిపించనప్పటికీ… ఎమ్మెల్సీలు మాత్రం మండలికి హాజరవుతున్నారు. ఇలా ఇరు సభలు ప్రారంభానికి ముందు ఇరు పార్టీల నేతలు కులాసా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ అసెంబ్లీకి రావాలంటే తన దగ్గర ఓ చిట్కా ఉంది అంటూ సూచించారు. అదేమిటని ప్రశ్నించగా… రోజుకో గంట పాటు అనర్గళంగా మాట్లాడేందుకు జగన్‌కు సమయం ఇస్తే చాలు… అసెంబ్లీకి వచ్చేస్తాడు అని కామెంట్ చేశారు.
కోటంరెడ్డి వ్యాఖ్యలపై కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం చెప్పగా… మీరు కొత్తగా వచ్చారు… నేను 2014 నుంచి జగన్ వెంటే అసెంబ్లీకి వచ్చానని పాత రోజులు గుర్తు చేసుకున్నారు. 2017లో పాదయాత్ర ప్రారంభించే సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి సీనియర్ నేతలకు అప్పగించి వెళ్లొచ్చు. కానీ జగన్ మాత్రం అలా చేయలేదన్నారు. ఎందుకంటే… సభలో ఆయన మినహా మిగిలిన వారెవరూ మాట్లాడటం జగన్‌కు అసలు ఇష్టం లేదన్నారు. అందుకే అసెంబ్లీకి రాలేదు… పార్టీ నేతలను కూడా రానివ్వలేదని ఆనాటి రోజులను కోటంరెడ్డి గుర్తు చేసుకున్నారు.
Also Read : నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్ చేసిన తెలుగు తమ్ముళ్లు..!
మైకు తనకు మాత్రమే ఉండాలని… మరొకరికి మాట్లాడే అవకాశం ఉండకూడదనే నియంతృత్వ మనస్తత్వం జగన్‌ది అని వ్యాఖ్యానించారు. జగన్ ఏం మాట్లాడినా సరే అడ్డం రాకూడదని… ఇదే జగన్ ఫిలాసఫి అని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేవలం మైక్ కోసమే పోరాడాలని పార్టీ నేతలకు చెప్పాడు తప్ప… ప్రజా సమస్యల కోసం ఏ రోజు మాట్లాడలేదని నాటి రోజులను కోటంరెడ్డి గుర్తు చేసుకున్నారు. సభలో మాట్లాడేందుకు గంట సమయం ఇస్తానంటే రేపే అసెంబ్లీకి వస్తాడని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించడంతో… అసెంబ్లీ లాబీల్లో ఉన్న వైసీపీ నేతలంతా అవాక్కయ్యారు.




