Tuesday, October 28, 2025 01:39 AM
Tuesday, October 28, 2025 01:39 AM
roots

వైసీపీలో నువ్వుంటే చాలంటున్న టీడీపీ నేతలు..!

కాగల కార్యం గంధర్వులే తీర్చారనేది పెద్దల మాట. అంటే.. కష్టపడకుండానే మన పనిని ఎదుటి వాళ్లు చాలా సులువుగా చేసి పెట్టారు అనేది ఈ మాటకు అర్థం. ఒక పని చేసేందుకో.. ఒక లక్ష్యాన్ని చేరేందుకో ఎన్నో ప్రణాళికలు రూపొందించుకుంటాం. కానీ ఏ మాత్రం కష్టపడకుండా ఆ పని సులువుగా పూర్తయితే.. మనం చేయాలనుకున్న పనిని ఎదుటి వ్యక్తే చేసి పెడితే.. అంతకంటే మహద్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా. ఇప్పుడు ఇదే మాట అంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే.. తాము పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదనేది తెలుగు తమ్ముళ్ల మాట. ఇందుకు తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులో.. లేక ప్రజల్లో మంచి మార్కులు సాధించడానికి గతంలో మాదిరిగా ఎక్కువ కష్టపడిపోవడమో కారణం కాదంట.. వైసీపీలో ఉన్న ఆ ఒక్క నేత వల్ల తమ గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకే ఆ నేతను జగన్ ఇంకా నమ్మాలని కూడా కోరుకుంటున్నారు. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా.. మరెవరో కాదు.. ఆయనే వైసీపీ ఫ్యూచర్ లీడర్ సజ్జల రామకృష్ణారెడ్డి.

Also Read : ట్రంప్, మస్క్ మధ్య ప్యాచ్ అప్.. ఇద్దరూ సెట్ అయినట్టే..?

వైసీపీ అంటేనే అమరావతికి బద్ధ శత్రువు అనేది వాస్తవం. అందుకే జగన్ అధికారంలోకి రాక ముందు ఒక మాట.. వచ్చిన తర్వాత మరో మాట చెప్పారు. అమరావతిలోనే తన ఇల్లు ఉందని గొప్పగా చెప్పిన జగన్.. ఆ తర్వాత తన మకాం విశాఖకు మార్చేందుకు రెడీ అయ్యారు. రాజధాని ప్రాంతంపై విషం చిమ్మటం మొదలుపెట్టారు. వైసీపీ నేతలు, సొంత మీడియా కూడా అవకాశం వచ్చినప్పుడల్లా తప్పుడు ప్రచారం చేశాయి కూడా. అమరావతిని ముంపు ప్రాంతమని, భూకంప కేంద్రమని, అడవి ప్రాంతమని, స్మశానమని.. ఇలా ఎన్నో దుష్ప్రచారాలు చేశారు. అయినా సరే ప్రజలు మాత్రం అమరావతికే జై అన్నారు. ఇక వైసీపీ అనుకూల మీడియా కూడా అమరావతిపై కావాల్సినంత తప్పుడు ప్రచారం చేసింది.

Also Read : అది సంకర జాతి కాదా సజ్జల..?

ఇక రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత సొంత ఛానల్‌ సాక్షిలో జరిగిన ఓ డిబేట్‌లో అమరావతిని వేశ్యల రాజధానిగా విశ్లేషకుడి ముసుగులో వైసీపీ పెయిడ్ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. దీనికి పక్కనే ఉన్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు.. వెకిలి నవ్వు నవ్వుతూ అవును నేను కూడా ఈ వార్త చదివాను అంటూ మద్దతు ఇచ్చారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇక మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శీరిష ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి.. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. ఆ వెంటనే బయటకు వచ్చిన వైసీపీ నేతలు.. దీనిని మీడియాపై దాడి అన్నట్లుగా వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం పోలీసు పాలన సాగిస్తోందని గగ్గొలు పెట్టారు.

Also Read : ఆయన చెప్పినట్లే.. గీత దాటితే అంతే..!

సరిగ్గా ఇలాంటి సమయంలోనే మీడియా ముందుకు వచ్చిన వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. అమరావతి మహిళలను ఏమీ అనలేదని.. ఇదంతా కేవలం టీడీపీ నేతలు చేస్తున్న రాజకీయ కుట్ర అని ఆరోపించారు సజ్జల. అంతటితో ఆగకుండా.. కొత్త నిందలు, దూషణలతో మరో అడుగు ముందుకు వేసిన సజ్జల… వైసీపీని మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్లారు. కడుపు మండి నిరసన తెలుపుతున్న మహిళలపై సజ్జల నోరు పారేసుకున్నారు. ఫోటోలను చెప్పులతో కొట్టే వారంతా సంకర తెగ అని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ మాటలతో వైసీపీ నేతల పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. అసలే అధినేతతో పాటు ఆయన సతీమణి కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇలాంటి సమయంలో కాస్త సంయమనం పాటించాల్సిన సజ్జల.. ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో.. ఇదేం ఖర్మరా నాయనా అంటూ వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అటు టీడీపీ నేతలు మాత్రం.. హమ్మయ్య.. సజ్జల ఒక్కడు చాలు.. మన పని సులువు అవుతుందంటున్నారు. ఇప్పటికే వైసీపీకి సజ్జల వల్ల కావాల్సినంత డ్యామేజ్ అయ్యింది అనేది వాస్తవం. విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా టార్గెట్ సజ్జల అన్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ చుట్టూ కోటరి చేరిందని.. అందుకే కార్యకర్తలకే కాదు ముఖ్య నేతలకు కూడా ఆయనను కలవకుండా అడ్డుకున్నారనేది వైసీపీలో కొందరు నేతలు ఆరోపణ. సజ్జల వంటి నేతలు మరొకరు ఉంటే చాలు.. టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక అంటున్నారు సొంత పార్టీ నేతలు కూడా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్