Friday, September 12, 2025 03:26 PM
Friday, September 12, 2025 03:26 PM
roots

ఆ విషయంలో బాబు సర్కార్ ఫెయిల్..!

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వారి మక్కెలు ఇరగొట్టాలి. పరిపాలన చేయడం చేత కాలేదు. మరి చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని ఏం చేయాలి.. ఆ విషయంలోనే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇంకా చెప్పాలంటే.. చేతకాక చేష్టలుడికి పోయింది. కట్టడి కాదు కదా… కనీసం.. ఎక్కడ నుంచి పోస్టులు పెడుతున్నారో కూడా గుర్తించలేని దయనీయ స్థితిలో కూటమి సర్కార్ ఉంది. 2019-2024 మధ్య కాలంలో ఐదేళ్ల పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్.. హయాంలో అయితే ప్రభుత్వానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కపోస్ట్ పెట్టినా.. లేద ఒక్క కామెంట్ చేసినా సరే… వెంటనే సీఐడీ పోలీసులు వచ్చేవారు. కేసులు పెట్టి అరెస్టులు చేసి.. నెలల తరబడి జైలులో ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Also Read : అమరావతి రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకుందా..?

ఏపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టిన సరే.. దానిపై నిరంతరం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఒక్కమాట కూడా అనే ధైర్యం లేదు. కానీ.. భవిష్యత్తు తరాల కోసం ఆధునిక రాజధానిని నిర్మిస్తున్న కూటమి ప్రభుత్వంపైన, సీఎం చంద్రబాబు పైన మాత్రం ఇష్టం వచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఐదేళ్ల పాటు ఏపీలో జగ్లక్ పాలన సాగింది. రాజధానిగా ఉన్న అమరావతి పూర్తి చేస్తే.. పేరు తెలుగుదేశం పార్టీకి వస్తుందనే అక్కసుతో మూడు రాజధానులంటూ విచిత్రమైన ప్రతిపాదన చేశారు వైఎస్ జగన్. అప్పుడు ఇదే భజన బ్యాచ్ ఆహో ఓహో అన్నారు. కానీ కనీసం ఒక్క ఇటుక కూడా వేయలేదు జగన్. అయినా సరే.. జగన్ సర్కార్‌ను పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా న్యాయపోరాటం చేస్తున్న అమరావతి రైతులపైన పెయిడ్ ఆర్టిస్టులంటూ నోటికి వచ్చినట్లు కారు కూతలు కూశారు.

Also Read : బాబు వ్యూహం ఫలిస్తుందా..?

ఐదేళ్ల పాటు పూర్తి నిర్లక్ష్యానికి గురైన అమరావతి పునర్ నిర్మాణానికి ఏపీ సర్కార్ నడుం బిగించింది. ఇందుకోసం రూ.55 వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు కూడా ఖరారు చేసింది. అలాగే అమరావతి పునఃప్రారంభ పనులను దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించారు. అలాగే అమరావతి నిర్మాణానికి పూర్తిస్థాయిలో కేంద్రం సహకరిస్తుందని కూడా హామీ ఇచ్చారు. అయితే.. ఇక్కడే వైసీపీ.. బ్లూ బ్యాచ్ తమ జూలు విదిలించింది. కూటమి సర్కార్‌పైన మరోసారి విషం కక్కే ప్రయత్నం చేసింది. సింహాచలంలో గోడ కూలిన ప్రమాదాన్ని అమరావతికి లింక్ పెడుతూ పోస్టులు పెడుతున్నారు వైసీపీ పేటీఎం బ్యాచ్. గోడ కట్టడం చేతకాని ప్రభుత్వం.. అమరావతిని ఎలా నిర్మిస్తుందో అంటూ వ్యాఖ్యలు చేస్తోంది. అమరావతి కూడా సింహాచలం గోడ లాంటిదేనా అని బురద జల్లుతోంది. ఇక ఉత్తరాంధ్ర నౌ అంటూ మీడియా ముసుగు వేసుకున్న వైసీపీ పెయిడ్ మీడియా అయితే.. ఇప్పటికీ అమరావతిని ముంపు ప్రాంతంగానే ప్రచారం చేస్తోంది. వర్షం పడితే ఇబ్బందులు పడేవాళ్లం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలిచేసింది. వర్షం వస్తే అమరావతి గ్రామాలు మునిగిపోతాయని సీఎం చంద్రబాబుకు తెలుసు.. అంటూ బురద జల్లుతోంది. అలాగే అమరావతి గురించి ప్రధాని మోదీ తెలుగులో చెప్పిన వీడియో పోస్టు చేసిన పెయిడ్ బ్యాచ్.. “పొత్తు లేకపోతే.. అమరావతి ఆంధ్రప్రదేశ్‌ను అధోగతి పాలు చేసే ప్రాజెక్టు అని మోదీ చెప్పేవారు.” అంటూ ఏకంగా ప్రధాని మాటలనే వక్రీకరించేలా పోస్టులు పెట్టింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర నౌ, విజయ్ కేసరి వంటి వ్యక్తులు దుష్ప్రాచారం చేస్తున్నారు. అయినా సరే.. వారిపై ఇప్పటి వరకు ఏపీ సర్కార్ కనీసం ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఐటీ పితామహుడు అని చెప్పుకునే చంద్రబాబు పరిపాలనలో.. ఉత్తరాంధ్ర నౌ ఎక్కడి నుంచి టెలికాస్ట్ అవుతుందో గుర్తించలేకపోయారు. వాటిని బ్యాన్ చేయించలేక పోతున్నారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందనేది అక్షరాల నిజం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్