Monday, September 8, 2025 07:23 PM
Monday, September 8, 2025 07:23 PM
roots

ఆ విషయంలో టీడీపీ ఫెయిల్ అయినట్లే..!

ఏపీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే సోషల్ మీడియా. వాస్తవానికి ప్రస్తుతం రాజకీయం అంటే.. కేవలం సోషల్ మీడియా అన్నట్లుగా మారిపోయింది. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే.. ప్రతి విషయం సోషల్ మీడియాలోనే జరుగుతుంది. చివరికి కమ్యూనిస్ట్ నాయకులు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగానే వెల్లడిస్తున్నారు. అలాంటి సోషల్ మీడియాను కొందరు పూర్తిగా నాశనం చేశారనే చెప్పాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Also Read : ప్రజల నిర్ణయమే ఫైనల్..!

ప్రస్తుతం తెలుగుదేశం, వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ పెద్ద ఎత్తున నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత దూషణలు చేసిన వైసీపీ సానుభూతిపరులు.. ఓడిన తర్వాత మాత్రం.. తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయతే ఇక్కడే అసలు విషయాన్ని టీడీపీ నేతలు మర్చిపోతున్నారు. వాస్తవానికి వైసీపీ నేతలు చేసే ఆరోపణలకు టీడీపీ గట్టిగా కౌంటర్ ఇవ్వలేక పోతుందనే మాటను మర్చిపోయారు.

వైసీపీ సోషల్ మీడియా స్పీడ్‌ను టీడీపీ సోషల్ మీడియా తట్టుకోలేకపోతుందనేది వాస్తవం. అధికారంలో ఉన్నప్పటి కంటే కూడా.. అధికారం కోల్పోయిన తర్వాతే వైసీపీ సోషల్ మీడియా స్పీడ్ పెంచిందంటున్నారు విశ్లేషకులు. వైసీపీ దూకుడును టీడీపీ తట్టుకోలేకపోతోంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఫేక్ న్యూస్ పోస్ట్ చేసే వాళ్లపై చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. ఇందుకు ఏకైక కారణం.. టీడీపీ సోషల్ మీడియా ఇంఛార్జులు ఘోరంగా విఫలమయ్యారు అనేది వాస్తవం.

Also Read : ఎమ్మెల్యే పెత్తనం.. కార్యకర్త నరకం.!

టీడీపీ సోషల్ మీడియలో పని చేస్తున్న మెజారిటీ ఉద్యోగులు జీతం కోసమే తప్ప.. పార్టీ పట్ల ఎలాంటి విధేయత, విశ్వాసం లేదని తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా బలహీనపడటానికి ప్రధాన కారణం చంద్రబాబు, లోకేష్‌తో పాటు టీడీపీ సోషల్ మీడియా పర్యవేక్షకులు ఘోరంగా విఫలమయ్యారని పార్టీ సీనియర్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు టీడీపీ సోషల్ మీడియాను ఎవరు పర్యవేక్షిస్తున్నారు.. వారికి పార్టీ పట్ల నిజంగానే చిత్తశుద్ధి ఉందా.. అనే మాట వినిపిస్తోంది. ఓ వైపు వైసీపీ సోషల్ మీడియా నిమిషానికో పోస్ట్‌తో చెలరేగిపోతుంటే.. టీడీపీలో మాత్రం.. ఆ దూకుడు పూర్తిగా మాయమైపోయింది.

వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వ శాఖల నుంచి కూడా మద్దతు వస్తుంది. ప్రతి ప్రభుత్వ శాఖ కూడా తమ పరిధిలో జరుగుతున్న కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆ ప్రచారంలో అధికారంలో ఉన్న పార్టీ నేతల గురించి కూడా తప్పకుండా ప్రస్తావించాలి. కానీ ఏపీలో మాత్రం.. ప్రభుత్వ శాఖాధిపతుల తీరు ప్రస్తుతం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో కనీసం పార్టీ గుర్తు కాదు కదా.. రంగు కూడా వాడటం లేదు. ఇక నేతల పేర్ల గురించి అయితే.. అలా రాస్తే పెద్ద నేరం చేసినట్లుగా చూస్తున్నారు పై అధికారులు. 2019-2024 మధ్య కాలంలో వైసీపీ పార్టీ రంగులతో సోషల్ మీడియాలో ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించారు అధికారులు. కానీ ప్రస్తుతం కనీసం మంత్రుల ఫోటోలు వాడినా కూడా నో చెప్పేస్తున్నారు.

Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ – లాభాలు మరియు నష్టాలు

పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అలాగే ఉంది తప్ప.. టీడీపీ సోషల్ మీడియా తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇందుకు అసలు కారణం.. పోరాటపటిమ లేని వారే ప్రస్తుతం సోషల్ మీడియాలో పని చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. నిన్నటి వరకు వైసీపీకి అనుకూలంగా పని చేసి వారే.. ఇప్పుడు టీడీపీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక మరో విషయం ఏమిటంటే.. వైసీపీలో చాలా మందికి జగన్ అంటే వీర విధేయత, నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టారు. ఇక వైసీపీ సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లు ఉన్నారు. వీళ్లంతా చంద్రబాబు, లోకేష్ అంటే పట్టరాని ద్వేషంతో రగిలిపోతున్నారు కూడా. అలాంటి వారికే సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు వైసీపీ పెద్దలు.

ఇక వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జులు కరుడుగట్టిన వైసీపీ వాదులు.. జగన్ భక్తులు కూడా. కానీ టీడీపీ సోషల్ మీడియాలో ఆ స్థాయి నేతలు, కార్యకర్తలు లేరనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం పార్టీ సోషల్ మీడియా వింగ్‌లో పని చేస్తున్న వారిలో మెజారిటీ భాగం.. పంచ్.. లంచ్.. పంచ్.. అన్నట్లుగా పని చేస్తున్నారు తప్ప.. పార్టీ పట్ల ఎలాంటి విధేయత చూపించటం లేదనేది టీడీపీ పోస్టులు చూస్తే తెలిసిపోతుంది. అధికారం అండదండలు లేకున్నా, వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోతుంటే.. చేతిలో అధికారం ఉండి కూడా టీడీపీ సోషల్ మీడియా పూర్తిగా చతికలపడి పరువు పొగట్టుకుందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

రేవంత్ గోప్యతకు కారణం...

రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ కాస్త డిఫరెంట్...

సజ్జలపై జగన్ సీరియస్.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి...

రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల...

దేశ రాజకీయాల్లో వారసత్వం అనేది ఎప్పుడూ...

అసలు బీఆర్ఎస్‌లో ఏం...

తెలంగాణ అంటే కేసీఆర్... కేసీఆర్ అంటే...

మేడం గురించే చర్చ..!

రెండు రోజులుగా సోషల్ మీడియా మోత...

అవును.. వాళ్లు మాత్రమే...

వైసీపీలో చీలిక వచ్చిందనే చర్చ ఇప్పుడు...

పోల్స్