ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడానికి మరో 8 రోజులు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి కూటమి గెలిచి.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్దం చేసుకుంది. ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తూ వచ్చింది. పాలన గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్న ప్రభుత్వం ఎన్నో కీలక అంశాల్లో మార్పులకు, కఠిన చర్యలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉంది గాని.. ఈ ఏడాదిలో మంత్రులు ఎంత వరకు సమర్ధవంతంగా పని చేసారు అనేదే కీలకంగా మారిన అంశం.
Also Read : చంద్రబాబు మార్క్ పాలన.. వాటిపైనే దృష్టి..!
ప్రభుత్వంలో మంత్రుల పాత్ర కీలకం. వైసీపీ పాలనలో మంత్రుల విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. టీడీపీ విషయానికి వస్తే.. మంత్రులకు పూర్తి స్వేచ్చ ఉంటుంది అనే అభిప్రాయం ఉంటుంది. మంత్రులు కూడా అలాగే కనపడుతూ ఉంటారు. మరి ఈ ఏడాదిలో మంత్రుల పని తీరు ఎంత వరకు బాగుంది అంటే.. చెప్పలేని పరిస్థితి. ఇక మంత్రులకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్దమయ్యారు. పలు విభాగాల్లో మంత్రులకు మార్కులు ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి.
Also Read : మతం కార్డు.. మలేషియాలో పాక్ డ్రామాలు
ప్రజలకు అందుబాటులో ఉండటం, శాఖా పరమైన పని తీరు, జిల్లాల పర్యటనలు, సోషల్ మీడియా పని తీరు, ఇంచార్జ్ మంత్రుల పని తీరు.. ఇలా అన్ని అంశాలకు సంబంధించి రిపోర్ట్ లు దాదాపుగా రెడీ అయినట్టు సమాచారం. కొందరు మంత్రులు మీడియాకు దూరంగా ఉండటం, ఎమ్మెల్యేలతో గొడవలు ఇలాంటి అంశాలను కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కొందరికి గుడ్ బై చెప్పే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. మరి ఎవరి పదవులు నిలబడతాయో చూడాలి.




