Friday, September 12, 2025 05:30 PM
Friday, September 12, 2025 05:30 PM
roots

పర్యాటక రంగానికి కూటమి మెరుగులు..!

రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. పుష్కరాల రేవు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో చేపట్టింది. చారిత్రక నగరం రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుందని పవన్ కల్యాణ్ తెలిపారు. విదేశీ పర్యాటకులనూ ఆకర్షించేలా నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తెలిపారు. రాజమండ్రి అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరం.. తీరం వెంబడి నాగరికత, నాగరికత ఉన్న చోట భాష ప్రాంతం వృద్ధి చెందుతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి ఈ నేల ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు జన్మనిచ్చిందన గుర్తు చేశారు. ఈ పవిత్ర నేల మహాభారతాన్ని తెలుగులో అందించిన ఆదికవి నన్నయకు జన్మనిచ్చిన నేల అని గుర్తు చేశారు. ఎంతో మంది కళాకారులకు, సామాజిక వేత్తలకు జన్మనిచ్చిందన్నారు.

Also Read : బ్లాక్ బాక్స్ డేటా డౌన్లోడ్.. ఎయిర్ ఇండియా ప్రమాదంలో కీలక పరిణామం

గోదావరి నదిపై హేవలాక్ బ్రిడ్జి చాలా పురాతనమైందని.. ప్రస్తుతం అది నిరుపయోగంగా ఉందన్నారు. ఇది బాగు చేసుకుని టూరిజం ప్రాజెక్టుగా వినియోగించుకోవాలని చాలా దశాబ్దాలుగా గోదావరి ప్రజల ఆకాంక్షఅని గుర్తు చేశారు. ఈ కలను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు గజేంద్ర షెకావత్ తెలిపారు. దాదాపు రూ.430 కోట్లతో 7 టూరిజం ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని 2024 ఎన్నికల సమయంలో ఎన్డీయే సర్కార్ నిర్ణయించిందని.. అందులో భాగమే అఖండ గోదావరి ప్రాజెక్టు అని షెకావత్ వెల్లడించారు. పర్యాటక రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టు పూర్తయితే 800 మందికి ఉపాధి దొరుకుతుందని.. ఏపీలో అన్ని టూరిజం ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ కల్యాణ్ తెలిపారు.

Also Read : తొలి ఎలక్ట్రిక్ విమానం.. టికెట్ రేట్ తెలిస్తే షాక్ అవ్వడమే..!

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే పదం కాదు.. శక్తివంతమైన ప్రభుత్వం అని అర్థమని ఎంపీ పురందేశ్వరి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో, కేంద్రంలో శక్తివంతమైన ప్రభుత్వాలు ఉండటం వల్ల ప్రాజెక్టులు సులువుగా వస్తున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర మంత్రి షెకావత్ తొలి నుంచి సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. జలశక్తి శాఖ మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తు చేశారు. ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్రతీరం, గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా వంటి నదులున్నాయని గుర్తు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని రివర్ ఫ్రంట్ ఏరియాల్లో విదేశాల్లో మాదిరిగా టూరిజం స్పాట్‌లుగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పుష్కర్ ఘాట్ అభివృద్ధితో పాటు చారిత్రక, కళా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అభివృద్ధి చేస్తామని.. అన్నవరం, గండికోట, శ్రీశైలం తదితర ప్రాంతాలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో అభివృద్ధి చెందుతున్నాయని.. ఎంపీ గుర్తు చేశారు.

Also Read : డబ్బు కోసం లైంగిక వీడియోల అమ్మకం.. హైదరాబాద్ జంట అరెస్ట్

భారతదేశాన్ని పర్యాటకుల గమ్యస్థానంగాత మోదీ సర్కార్ తీర్చిదిద్దుతోందన్నారు మంత్రి దుర్గేష్.ఏపీలో స్వదేశీ దర్శన్ స్కీమ్ ద్వారా 2015-17లో కాకినాడ హోప్ ఐల్యాండ్, కోరింగ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పులికాట్ సరస్సు, మైపాడు బీచ్, ఇసుకపల్లిలో సర్య్కూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్ లో భాగంగా శాలిహుండం, బావికొండ, అమరావతికి సహకారం అందించినట్లు గుర్తు చేశారు. స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా అరకు, బొర్రా గుహలు, లంబసింగి, సూర్యలంక బీచ్‌లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. పర్యాటకులకు సాహస పర్యాటక అనుభవాలను అందిస్తున్నామన్నారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా ఆధ్యాత్మిక టూరిజానికి బాటలు వేస్తున్నట్లు వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించేందుకు, హేవలాక్ బ్రిడ్జి, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 120 ఎకరాల్లో బ్రిడ్జి లంకను వృద్ధి చేస్తామని.. బూటింగ్‌తో పాటు టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి కలుగనుందని పవన్ తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్