Saturday, September 13, 2025 01:51 AM
Saturday, September 13, 2025 01:51 AM
roots

ఆ విషయంలో కూటమి ఫెయిల్..!

ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. తాత్కాలిక ప్రయోజనాల కంటే కూడా దీర్ఘకాలిక లాభాలపైనే చంద్రబాబు ఎప్పుడూ దృష్టిపెడతారు. అందుకే ఆయనకు విజనరీ అనే పేరు కూడా. 1995లో విజన్ 2020 అని ప్రకటించారు. అందుకు తగినట్లుగా సంస్కరణలు తీసుకువచ్చారు. పదేళ్లు అధికారంలో లేకపోయినప్పటికీ… ఆయన తీసుకున్న చర్యల వల్ల హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పుడు కూడా విజన్ 2047 అంటున్నారు. అందుకు తగినట్లుగానే పని చేస్తున్నారు చంద్రబాబు. అయితే ఒక విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం విఫలమైందనే మాట బలంగా వినిపిస్తోంది. అదే సోషల్ మీడియాపై నియంత్రణ.

Also Read : ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

ఏపీలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణం వైసీపీ సోషల్ మీడియా. నాటి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడంతో ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు. అయితే 2024లో అదే వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ప్రజలు గుర్తించడంతో మరోసారి వైసీపీకి అవకాశం రాలేదు. అయితే అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా సైకోలు టీడీపీ, జనసేన నేతలపై వ్యక్తిగత దూషణలు చేశారు. కుటుంబ సభ్యులను సైతం కించపరిచేలా వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియా సైకోలపై చర్యలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కుమార్తెలపైన, ఏపీ హోమ్ మంత్రి అనితపైన కూడా జుగుప్సాకరమైన కామెంట్లు చేయడంతో దాదాపు 150 మందిపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు.

Also Read : నేను వస్తున్నా.. పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్

అయితే ఈ అరెస్టుల సమయంలో కొద్ది రోజులు మాత్రం కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం కాస్త బ్రేక్ ఇచ్చారు వైసీపీ సైకోలు. మళ్లీ ఇప్పుడు అదే సోషల్ మీడియా వేదికగా కూటమి ప్రభుత్వంపైన, ఏపీ రాజధాని అమరావతిపైన, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన కామెంట్లు చేస్తున్నారు. అమరావతిని ముంపు ప్రాంతమంటూ ప్రచారం చేస్తున్నారు. రూ.లక్ష కోట్లను అమరావతి పేరుతో వృధా చేస్తున్నారని ఉత్తరాంధ్ర నౌ పేరుతో నిర్వహిస్తున్న మీడియా ముసుగులో ఉన్న వైసీపీ పేటీఎం బ్యాచ్ నిత్యం ప్రచారం చేస్తోంది. చివరికి రహదారి ప్రమాదాలు జరిగినా సరే… అది కూటమి ప్రభుత్వ తప్పు అన్నట్లుగా కామెంట్లు చేస్తోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేసినా సరే.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇక ప్రెస్ మీట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు నిధుల గురించి చంద్రబాబు ఒకటి చెబితే.. వైసీపీ సోషల్ మీడియా మాత్రం పథకాలకు మంగళం అంటూ ప్రచారం చేస్తోంది. దీంతో వైసీపీ ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్