Friday, September 12, 2025 07:28 PM
Friday, September 12, 2025 07:28 PM
roots

రాజ్యసభ సీటుపై కూటమి సంచలన నిర్ణయం…?

ఆంధ్రప్రదేశ్ లో ఒక రాజ్యసభ స్థానం కాళీ ఉండటంతో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై.. రాజకీయ వర్గాల్లో దాదాపు నెల రోజుల నుంచి పెద్ద చర్చ జరుగుతుంది. రాజ్యసభ స్థానం విషయంలో వైసీపీకి అవకాశాలు లేకపోవడంతో కూటమి నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది అనేదానిపై ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు. మూడు నెలల క్రితం భర్తీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో.. జనసేన పార్టీకి అవకాశం దక్కలేదు. దీనితో విజయసాయిరెడ్డి తో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఈసారి జనసేన పార్టీ నుంచి ఓ కీలక నేత ఎన్నికయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం మొదలైంది.

Also Read :ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కవర్ డ్రైవ్..!

ఇదే సమయంలో బిజెపి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. దాదాపు మూడున్నర ఏళ్ళు ఉన్న రాజ్యసభ స్థానం కోసం ఆశావాహుల సంఖ్య గట్టిగానే ఉంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలు అలాగే రాజ్యసభ సీటు విషయంలో కూటమి నేతలు ఒక అంగీకారానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని జనసేన పార్టీకి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీనికి చంద్రబాబు నాయుడు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.

Also Read : రాకున్నా.. వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారేమిటో…!

ఎమ్మెల్సీ కోటా ఎన్నికల్లో ఒకటి బిజెపికి.. నాలుగు ఎమ్మెల్సీలను టిడిపి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.. జనసేనకు రాజ్యసభ సీటు ఇవ్వటానికి బిజెపి కూడా మద్దతు ఇవ్వడంతో దాదాపుగా జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే జనసేన నుంచి ఎవరిని ఎంపిక చేస్తారని దానిపై క్లారిటీ లేదు.. నాగబాబు పేరు ప్రముఖంగా వినపడుతున్నా కొన్ని కారణాలతో ఆయనను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా ఉంది. ఎమ్మెల్సీ కూడా ఆయనకు ఇచ్చేందుకు కూటమిలో సుముఖత రాలేదని సమాచారం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్