Tuesday, October 28, 2025 05:22 AM
Tuesday, October 28, 2025 05:22 AM
roots

కుందనపు బొమ్మలా తారకరత్న కూతురు

దివంగత నటుడు నందమూరి తారకరత్న, ఆయన భార్య అలేఖ్య రెడ్డి ల గురించి మనందరికీ తెలిసిందే. తారకరత్న మరణం తర్వాత సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అలేఖ్య రెడ్డి. ఎప్పుడైనా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఎక్కువ శాతం తన పిల్లలకు సంబంధించిన విషయాల గురించి అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఉంటుంది అలేఖ్య రెడ్డి.

అందులో భాగంగానే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. అదేమిటంటే తాజాగా తన పెద్ద కుమార్తె నిష్క ఓణీల వేడుక జరిగిందంటూ దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది అలేఖ్య రెడ్డి. కూతురు హాఫ్ శారీ ఫంక్షన్ చాలా ఘనంగా జరిపినట్టు తెలుస్తోంది. మొదట తండ్రి తార‌క‌త్న ఫోటోల‌ను అందంగా డెకరేట్ చేసి నివాళులు అర్పించి కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టిన‌ట్లు వారు షేర్ చేసిన ఫోటోలను చూస్తే అర్ధం అవుతుంది.

నిష్క హాఫ్ సారీలో కుంద‌న‌పు బొమ్మ‌లా ఉంది. వేడుక కోసం ఎంతో అందంగా ముస్తాబైంది. నుదిటిన పాపిడి బొట్టు, మెడ‌లో బంగారు ఆభ‌ర‌ణాలు, న‌డుముకు వ‌డ్డానం, చెవుల‌కు పెద్ద బుట్ట‌లు, రెండు చేతుల‌కు గాజులు ధ‌రించింది. క్రీమ్ కల‌ర్ చీర మ్యాచింగ్ బ్లౌజ్ లో నిష్క ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఒకప్పుడు నిష్క నీ ట్రోల్ చేసిన వారే ఈరోజు ఆమెను చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. చాలా అందంగా ఉంది.. అందానికి దిష్టి తగులుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read : బిగ్ బ్రేకింగ్: అమ్మకే బ్రతుకుపై అసహ్యం కలిగించారు

కాగా ఈ కార్యక్ర‌మంలో అలేఖ్య రెడ్డి తరుపు బంధువులు, స్నేహితులు, స‌న్నిహితులు అంతా పాల్గొన్న‌ట్లు తెలుస్తోంది.వైసీపీ నేత విజ‌యసాయి రెడ్డి స‌తీస‌మేతంగా పాల్గొని నిష్క‌ని ఆశీర్వ‌దించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నిష్మకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్