Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

డీ లిమిటేషన్ పై సుప్రీం సంచలన కామెంట్స్..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో దాదాపు నాలుగేళ్ల నుంచి ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది. ఇటు రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నాయి. పార్టీకి ఆర్ధిక సహకారం అందించిన వారు సీట్లు అడుగుతున్న నేపధ్యంలో, ఈ విషయంలో రాజకీయ పార్టీలపై కనపడని ఒత్తిడి ఉంది. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు కోసం గానూ డీలిమిటేషన్ కసరత్తు నిర్వహించాలని దాఖలైన పిటిషన్‌ ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది.

Also Read : ఎన్టీఆర్ పై బాలీవుడ్ జనాల కుళ్ళు.. ఆల్ఫా మేల్ కాదంటూ కామెంట్

జస్టిస్ సూర్యకాంత్ మరియు ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలపై వివక్ష చూపారనే వాదనను తోసిపుచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే రాష్ట్రాలలో డీలిమిటేషన్‌కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి జారీ చేసిన డీలిమిటేషన్ నోటిఫికేషన్ నుండి తెలుగు రాష్ట్రాలను మినహాయించడం ఏకపక్షంగా లేదా వివక్షతతో కూడుకున్నది కాదని, కేవలం రాజ్యాంగ బద్ధమైన నిర్ణయంగా తెలిపింది.

Also Read : పంత్ కు ఫిదా అయిపోయిన ఇంగ్లీష్ ఫ్యాన్స్

అంతేకాకుండా, రెండు రాష్ట్రాలలోని అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో ముడిపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26ను అమలు చేయడానికి కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కె పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను మినహాయించి, కొత్తగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ, పార్లమెంటరీ నియోజకవర్గాలను మాత్రమే డీలిమిట్ చేయడం సరికాదని, రాజ్యాంగ విరుద్దమని పురుషోత్తం రెడ్డి వాదించారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి లోబడి ఉంటుందని, దీని ప్రకారం 2026 తర్వాత నిర్వహించిన మొదటి జనాభా లెక్కల తర్వాత మాత్రమే డీలిమిటేషన్ కసరత్తు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్