Saturday, September 13, 2025 08:26 PM
Saturday, September 13, 2025 08:26 PM
roots

బాబు గారు… మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి సార్….!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతోషించిన వారిలో క్రీడాకారులు కూడా ఒకళ్లు. వాస్తవానికి ఏపీలో ఐదేళ్లుగా క్రీడారంగం పడకేసిందనే చెప్పాలి. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వం చివరి ఏడాదిలో కాస్త హడావుడి చేసినప్పటికీ… అదేం పెద్ద ప్రభావం చూపలేదు. పైగా ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏకంగా రూ.110 కోట్లు స్వాహా చేశారని శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ద రెడ్డి, మాజీ మంత్రి రోజా పైన ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి. అలాగే ఆడుదాం ఆంద్రలో తమ వారినే ఎంపిక చేయాలంటూ నేతలంతా పీఈటీలపై ఒత్తిడి తీసుకువచ్చారని కూడా ఆరోపణలు వచ్చాయి. చివరికి ఫైనల్‌కు చేరుకున్న జట్టులో తమ ప్లేయర్‌ను ఆడించాలంటూ నాటి హోమ్ మంత్రి తానేటి వనిత రికమండ్ చేశారని కొంతమంది క్రీడాకారులు ఫిర్యాదులు కూడా చేశారు.

ఇక ఐదేళ్ల పాలనలో ఏపీలో జరిగిన ఒక్క మేజర్ ఈవెంట్ కూడా లేదనే చెప్పాలి. 2014-19 మధ్య కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి సమీపంలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణాన్ని బీసీసీఐ చేపట్టింది. దీని కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం స్థలం కేటాయించడంతో పాటు… క్రికెటర్ల కోసం గుంటూరు సమీపంలో 5 స్టార్ హోటల్ కూడా ఐటీసీతో ప్రారంభించింది. ఇక స్టేడియం పనులు కూడా 70 శాతం పైగా అప్పట్లో పూర్తయ్యాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అప్పటి వరకు ఉన్న గోకరాజు గంగరాజును తప్పించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏసీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈయనకు ఎంత వరకు రాజకీయాలే తప్ప.. క్రీడాకారుల సంక్షేమం పైన, క్రీడల నిర్వహణపైన ఎలాంటి దృష్టి పెట్టలేదు. దీంతో మంగళగిరి స్టేడియం పనులు ఆగిపోయాయి.

Also read : రఘురామరాజు కేసులో కీలక ట్విస్ట్..! విజయ్ పాల్ ను దాచింది ఎవరు..?

చివరికి ఆ ప్రాంతమంతా నిర్మానుషంగా మారడంతో… అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. ఇక శాప్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించాల్సిన రెగ్యులర్ ఈవెంట్లను కూడా నిర్వహించలేదు. దీంతో క్రీడాకారులంతా సరైన ప్రొత్సాహం లేక వెనుకబడిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీఏ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఎంపికయ్యారు. ఇప్పటికైనా మంగళగిరి స్టేడియం పనులు ఊపందుకుంటాయని అంతా భావిస్తున్నారు. అలాగే గతంలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియానికి రూ.4 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం దానిని పూర్తిగా పక్కన పెట్టింది. ఇప్పుడు ఆ ఫైల్‌ను బయటకు తీసిన అచ్చెన్న… మరో కోటి రూపాయలు కలిసి రూ.5 కోట్లతో పనులు ప్రారంభించారు.

అలాగే ఆర్చరీ, బాడ్మింటన్, కోకో, కబడ్డీ క్రీడాకారులు కూడా తమకు తగిన ప్రొత్సాహం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2002లో నేషనల్ గేమ్స్, ఆఫ్రో – ఆసియన్ గేమ్స్‌ కోసం హైదరాబాద్‌ నగరంలో అంతర్జాతీయ స్టాయి స్టేడియాలను చంద్రబాబు నిర్మించారు. ఇప్పటికీ అవి చెక్కుచెదరకుండా ఎంతో మంది క్రీడాకారులకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏపీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం క్రీడల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. దీని ద్వారా విదేశీ మారకం కూడా పెద్ద ఎత్తున వస్తుందని… పర్యాటక రంగానికి కూడా ఊతమిస్తుందనేది నిపుణుల మాట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్