ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అరెస్ట్ లు చాలా కామెడీగా ఉంటున్నాయి. పోలీస్ శాఖలో కొందరు పోలీస్ అధికారుల ఓవరాక్షన్ చూస్తున్న ప్రభుత్వం విస్మయం వ్యక్తం చేస్తుంది. సాధారణ ప్రజలు అయితే మైండ్ బ్లాక్ అయి సోషల్ మీడియాలో నానా తిట్లు తిడుతున్నారు. గతంలో జైలు అంటే ఓ రేంజ్ లో భయం ఉండేది. ప్రముఖులకు కాస్త స్పెషల్ గా వసతులు ఉండేది. కానీ ఇప్పుడు నేరాలు, పాపాలు చేసిన వారికి కూడా సకల సౌకర్యాలు కల్పిస్తూ అధికారులు సేవలు చేస్తున్నారు. స్వామి భక్తిని వేరే లెవెల్ లో చూపిస్తున్నారు.
Also Read : బియ్యం మాఫియా పై పవన్ ఫైర్.. కాకినాడ పోర్టులో పవన్ తుఫాన్
గనుల వెంకటరెడ్డికి చేసిన సేవలు చూస్తే అందరూ షాక్ అవుతున్నారు. ఫ్రిడ్జ్, టీవీ, పరుపు సహా ఎన్నో సౌకర్యాలు కల్పించారు. అలాగే ఆయన కోరిన భోజనం ఇంటి నుంచి అందేలా ఏర్పాట్లు చేసారు. బెయిల్ పై బయటకు వచ్చిన వెంకటరెడ్డికి జైల్లో జరిగిన సేవలు చాలా గొప్పగా ఉన్నాయని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఇది చూసిన జనాలు… ఇంట్లో కంటే జైల్లో ఉంటే సెక్యూరిటీతో పాటు హోటల్ లో ఉన్నట్లు వసతులు కూడా ఉంటాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మంచి భోజనం సకల భోగాలు ఉన్నప్పుడు అనవసరంగా బెయిల్ ఎందుకు తెచ్చుకున్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : కొడుకు కోసం మెట్టు దిగుతున్న కాపు నేత…!
ఇక బోరుగడ్డ అనీల్ తో పాటుగా కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో చిల్లరగా పోస్ట్ లు పెట్టిన వారిని కూడా అరెస్ట్ చేసారు. అందులో రాజకీయంగా ఫేమస్ అయిన వ్యక్తులు కూడా ఉన్నారు. వారికి మరి ఏ విధంగా సేవలు అందుతున్నాయి అనేది క్లారిటీ లేదు. బోరుగడ్డ అనీల్ కు అయితే పరుపు, దుప్పటి, మంచం… కాళ్ళ వద్ద దిండు, భోజనం ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పించారు. పోలీసు సిబ్బందిపై ఓ వైపు చర్యలు తీసుకుంటున్నా అధికారుల తీరులో మాత్రం ఏ విధమైన మార్పు లేదు. అరెస్ట్ చేయడం టైం వేస్ట్ అంటున్నారు సామాన్య ప్రజలు.