Tuesday, October 28, 2025 05:22 AM
Tuesday, October 28, 2025 05:22 AM
roots

బాలయ్యపై ఎందుకీ అక్కసు..?

నందమూరి కుటుంబం విషయంలో కొందరిలో కాస్త అతి ఎక్కువగా ఉంటుందనే మాట వాస్తవం. ముఖ్యంగా బాలకృష్ణపై చేసే కామెంట్స్ ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి. బాలకృష్ణ సినిమాలపై జరిగే ట్రోలింగ్ కూడా ఆశ్చర్యమే. సినిమాలు బాగున్నా సరే.. ఏదోక లోపాలు వెతుకుతూ ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఖైదీ నెంబర్ 150 హీరోయిన్ కాజల్.. చిరంజీవి కంటే వయసు చాలా తక్కువే అయినా.. అయినా.. రవితేజా కంటే శ్రీలీల చాలా చిన్నదే అయినా కామెంట్ చేయని జనాలు.. బాలకృష్ణ పక్కన నటించే హీరోయిన్లను ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.

Also Read : జగన్ కోసం షార్ప్ షూటర్స్ కామెంట్.. మాయమైపోయిన జర్నలిస్ట్

తాజాగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు వస్తే.. ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. క్రెడిట్ డైరెక్టర్ ఖాతాలో వేస్తూ బాలయ్యపై విమర్శలు చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప సినిమాకు అవార్డ్ వస్తే బాలయ్య అభినందించారు. కాని అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాలయ్యను ట్రోల్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. వారిలో మెగా అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండే కొన్ని పేజెస్ బాలయ్యపై సెటైర్ లు వేస్తూ పోస్ట్ లు పెట్టడం గమనార్హం.

Also Read : ప్రజ్వల్ రేవన్నకు కోర్ట్ బిగ్ షాక్.. పొలిటికల్ కెరీర్ ఖతం..!

బాలకృష్ణ హోస్ట్ గా వచ్చే.. ఆహాలో అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్, బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెట్టాడు. ఆ వీడియో లను నందమూరి ఫ్యాన్స్ కూడా వైరల్ చేసారు. దాదాపుగా సినిమా పరిశ్రమ మొత్తం బాలయ్యను అభినందించింది. అయినా సరే ఫ్యాన్స్ రూపంలో కొందరు ట్రోల్ చేయడం, దానిని రాజకీయ పార్టీల కార్యకర్తలు క్యాష్ చేసుకోవడం గమనార్హం. అటు అల్లు అర్జున్ తో కూడా బాలయ్య సన్నిహితంగానే ఉంటారు. ఏది ఎలా ఉన్నా ప్రస్తుత మెగా ఫ్యాన్స్, మాజీ మెగా ఫ్యాన్స్ బాలయ్యను ట్రోల్ చేస్తున్న విధానం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్