ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విచారణ వేగవంతం అయింది. నిందితులుగా భావిస్తున్న పలువురిని అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పక్కా ఆధారాలతో వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. కీలక అంశాల్లో సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టారు అధికారులు. అతనే ఈ స్కాం లో అత్యంత కీలకంగా వ్యవహరించినట్టు ముందు నుంచి భావిస్తున్న అధికారులు.. అతని సన్నిహితుల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
Also Read : వైసీపీకి మరో షాక్ సిద్ధం..?
బంగారం ద్వారా ముడుపులు చెల్లించారని అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల నెట్వర్క్ లో కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి పాత్ర కీలకమని అధికారులు కోర్ట్ కు తెలిపారు. డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా హవాలా మార్గంలో విదేశాలకు డబ్బు తరలింపు వ్యవహారంలో పాత్రధారులు మరికొందరు అని అధికారులు పేర్కొన్నారు. సబ్ లీజు, సొంతబ్రాండ్లతో మద్యం అమ్మకాలు చేసేది ఒకరని.. లెక్కలన్నీ చూసేది, ముడుపులు వసూలు చేసేది ఇంకొకరని తేల్చారు.
Also Read : మహానాడులో చర్చించే అంశాలేమిటో తెలుసా..?
తరలించేది. మరొకరు.. ఇందులో ఆరుగురి పాత్ర కీలకమని విచారణ బృందాలు గుర్తించాయి. మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతోనే వీరిలో నలుగురు యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమి రేట్స్)లో, మరొకరు థాయ్లాండ్లో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వీరిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసారు. సీబీఐ ద్వారా అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ల వద్ద నిఘా ఏర్పాటు చేసారు. విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్న బూనేటి చాణక్యను ఇటీవల చెన్నై చిన్న విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.




