అంతర్జాతీయ క్రికెట్ లో సారధిగా జట్టును ముందుకు నడిపించడం అనేది అంత సాధారణ విషయం కాదు. కెప్టెన్ గా ఎంపిక చేసే వ్యక్తి సారధ్య బాధ్యతలతో పాటుగా, జట్టులో తన పాత్రను సమర్ధవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో ప్రస్తుత భారత కెప్టెన్ గిల్ విఫలమవుతున్నాడని ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ ఏడాది ఇంగ్లాండ్ లో భారత్ ఆడిన అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీకి గిల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో 50 ఓవర్ల ఫార్మేట్ కు అతనిని కెప్టెన్ గా ఎంపిక చేశారు.
Also Read : గట్టిగానే సంక్రాంతి పోటీ.. ఇవి ఫిక్స్..!
ఆస్ట్రేలియా లాంటి కఠిన దేశంలో అతనికి తొలిసారి వన్డే కెప్టెన్ గా అవకాశం ఇవ్వటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విమర్శలకు తగ్గట్టే గిల్ బ్యాటింగ్ లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీనితో సెలెక్టర్లపై, హెడ్ కోచ్ గంభీర్ పై, కెప్టెన్ గిల్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎంతసేపు సీనియర్ల ఆట తీరుపై దృష్టి పెట్టె కోచ్ గంభీర్.. గిల్ విషయంలో ఎందుకో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడని అనుమానాలు వ్యక్తమయ్యాయి. హర్షిత్ రానా ను జట్టులోకి తీసుకోవడంపై కూడా విమర్శలున్నాయి. సమర్థవంతమైన ఆటగాళ్లను తీసుకునే విషయంలో వీరు విఫలమయ్యారు అనేది ప్రధాన విమర్శ.
Also Read : ఆర్టీసీ బస్సు తప్పింది.. కావేరి బలైంది.. కర్నూలు ఘటనలో సినీ ఫక్కీ సీన్లు
దీనితో 2027 ప్రపంచకప్ వరకు వీళ్లిద్దరు కొనసాగుతారా లేదా అనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశం ఉన్నా సరే గెలవలేకపోయింది భారత్. గత ఏడాది ఆస్ట్రేలియాలో కూడా సమర్థవంతంగా ఆడినా సరే బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో జరిగిన లోపాలు తీవ్ర విమర్శలకు దారితీసాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో కూడా అవే పరిస్థితులు ఎదురయ్యాయి. దీనితో మాజీ క్రికెటర్ల అభిప్రాయం ప్రకారం గిల్ కెప్టెన్ గా ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు అనేది వినపడుతోంది. గంభీర్ విషయంలో కూడా బోర్డు కఠినంగా వ్యవహరించేఅవకాశాలు సైతం ఉన్నాయని, గంభీర్ ఆ టార్గెట్ చేసిన సీనియర్లు సమర్థవంతంగా ఆస్ట్రేలియా పర్యటనలో రాణించారని, కాబట్టి ఇప్పుడు సెలక్షన్ కమిటీతోపాటుగా కోచింగ్ స్టాఫ్ విషయంలో కూడా కఠినంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. గంభీర్ వైఖరి మారకపోతే మాత్రం భారత క్రికెట్ 2006 సమయంలో గ్రెగ్ చాపెల్ కోచ్ గా ఉన్నప్పటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.




