Tuesday, October 28, 2025 05:20 AM
Tuesday, October 28, 2025 05:20 AM
roots

తల్లి పాలలో ప్లాస్టిక్ రేణువులు.. సర్వే షాకింగ్ రిపోర్ట్.!

ప్లాస్టిక్ మన రోజువారీ జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇంటా బయట ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం తప్పనిసరి అయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ లేనిదే మన జీవితం సాఫీగా సాగించలేకపోతున్నాం. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇదే నిజం. టూత్ బ్రష్, వాటర్ బాటిల్, టీ కప్, ప్లేట్, స్పూన్.. ఇలా ఏదైనా ప్లాస్టిక్‎తో ముడిపడింది. మనిషి శరీరంపై ప్లాస్టిక్ ప్రభావం అంశంపై చేసిన తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

మన లైఫ్‎లో ప్లాస్టిక్ ఒక భాగం అయిందని మనం అనుకుంటున్నాం.. కానీ ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే.. ప్లాస్టిక్ మన జీవితంలోనే కాదు, మన శరీరంలోనే భాగం అయింది. అర్థం కాలేదా? అయితే అసలు విషయం ఈ స్టోరీలోకి రండి. అమెరికా, ఆస్ట్రియా దేశాల తాజా పరిశోధనలో షాక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాస్టిక్ ఉపయోగం మానవ జాతి మనుగడకు ముప్పులా మారింది. ప్లాస్టిక్‎లో ఉండే అత్యంత సూక్ష్మరూపంలో ఉండే ప్లాస్టిక్ రేణువులు గాలిలో చేరుతున్నాయి. మనం తీసుకునే డ్రింక్, ఫుడ్ ద్వారా నీరు, ఆహారంలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల రేణువులు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండాలు, కాలేయం ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై దుష్ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

అంత కంటే డేంజర్‎గా తల్లిపాలలో కూడా ప్లాస్టిక్ రేణువులను గుర్తించారు పరిశోధకులు. తల్లి పాల ద్వారా అప్పుడే పుట్టిన పిల్లలకు ఆహారంగా ప్లాస్టిక్ రేణువులు మారుతున్నాయి అనే భయంకర విషయాన్ని గుర్తించారు. దీంతో పాటు మగవారి వీర్య కణాలలో కూడా మైక్రోప్లాస్టిక్ ఆనవాళ్లను గుర్తించారు పరిశోధకులు. దీని ద్వారా సంతానోత్పత్తిపై కూడా ప్లాస్టిక్ ప్రభావం పెద్దగా ఉందని తెలిపారు. తాజా ఫలితాలను బట్టి పురుషుల సంతానోత్పత్తి సామర్త్యంపై ప్లాస్టిక్ ప్రభావం బాగా ఉందని గుర్తించినట్టు అమెరికా, ఆస్ట్రియా పరిశోధకులు తెలిపారు. 30 మంది పురుషుల నుంచి సేకరించిన వీర్యకణాలను విశ్లేషించగా.. 11 నమూనాల్లో మైక్రోప్లాస్టిక్‎ను గుర్తించినట్టు తెలిపారు. మనం రోజూ వాటర్ తాగే లీటర్ ప్లాస్టిక్ బాటిల్లో 2,40,000 ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

సమస్య తెలిసిందే.. మరి పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉంది. ప్లాస్టిక్ ని దూరంగా పెడదామా లేక ఇప్పటికే మన శరీరంలో భాగం అయింది కదా.. ఇంకేముందిలే అనుకుంటే అదేదో సినిమాలో చెప్పినట్లు.. మన సంపాదన మన ఆసుపత్రుల బిల్లులకే సరిపోకపోవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్