Tuesday, October 28, 2025 05:22 AM
Tuesday, October 28, 2025 05:22 AM
roots

రూల్స్ పెడతాం.. ఫాలో అవ్వం.. కరుణ్ నాయర్ కు అన్యాయం…!

టీం ఇండియాలో ఆడాలి అంటే.. కచ్చితంగా దేశవాళి క్రికెట్ ఆడాల్సిందే.” ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర వైఫల్యం అనంతరం బోర్డు తీసుకొచ్చిన నూతన పాలసీ ఇది. అందుకే వెంటనే స్టార్ ఆటగాళ్ళు జైస్వాల్, పంత్, జడేజా, రోహిత్ శర్మ అందరూ రంజీ ట్రైనింగ్ క్యాంపులకు హాజరు అయ్యారు. రంజీలు ఆడేయడానికి సిద్దమయ్యారు. కాని ఓ ఆటగాడు మాత్రం దేశవాళి క్రికెట్ లో సరికొత్త చరిత్ర సృష్టిస్తే కనీసం ఆ ఆటగాడిని పట్టించుకోలేదు సెలెక్టర్లు. దేశవాళి క్రికెట్ ప్రామాణికం అయినప్పుడు.. అక్కడ సత్తా చాటిన ఆటగాడికి విలువ లేకుండా పోయింది.

Also Read : గాయం సాకు.. రంజీలకు దూరంగా రాహుల్, కోహ్లీ..?

2024-25 విజయ్ హజారే ట్రోఫీలో 389.50 సగటుతో 8 ఇన్నింగ్స్‌ లలో 779 పరుగులు చేసాడు కరుణ్ నాయర్. ఈ టోర్నీలో కేవలం రెండు సార్లు మాత్రమే అవుట్ అయ్యాడు కరుణ్. అయినా సరే ఈ 33 ఏళ్ల విదర్భ కెప్టెన్‌ కు భారత జట్టులో స్థానం లేదు. అతను ఈ దేశవాళీ టోర్నమెంట్‌ లో చివరి మ్యాచ్‌కు ముందు 752 సగటుతో దుమ్ము రేపాడు. అయినా సరే అవకాశం కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై మాజీ ఆటగాళ్ళు సీరియస్ అవుతున్నారు. సచిన్ టెండూల్కర్ సైతం కరుణ్ నాయర్ ఆటతీరుని కొనియాడాడు.

Also Read : భయపడుతున్న జనసేన..? పవన్ భద్రతపై ఆందోళన…!

దీనిపై తాజాగా మరో మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం కీలక వ్యాఖ్యలు చేసారు. అతను నిజంగా చాలా కష్టపడ్డాడు అని… అతను ఆడిన ప్రతీ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకం అని కొనియాడాడు. నా ఉద్దేశ్యం, సగటున 700, 750 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదన్నాడు. కాని అతనికి జట్టులో చోటు దక్కలేదన్నాడు. కానీ ప్రస్తుతానికి, ఈ జట్టులో స్థానం దక్కించుకోవడం చాలా కష్టం అన్నాడు. ఇతర ఆటగాళ్ళ కంటే అతను చాలా బాగా ఆడాడు అని పేర్కొన్నాడు. రంజీ ట్రోఫీలో అతని ఫామ్ అలాగే ఉంటే, రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో అతన్ని ఎంపిక చేయవచ్చని అభిప్రాయపడ్డాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్