బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెంటాడుతూనే ఉంది. గత రెండేళ్ళ నుంచి సల్మాన్ ఖాన్ ను అంతం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ అనుచరులు.. సల్మాన్ ఇంటి వద్ద పలుమార్లు రెక్కీలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది.. సల్మాన్ అత్యంత సన్నిహితుడ్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఇక అక్కడి నుంచి సల్మాన్.. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాడు. దానికి తోడు కృష్ణ జింకల కేసు కూడా అతన్ని ఇబ్బంది పెడుతోంది.
Also Read : రిషబ్ పంత్ కెప్టెన్సీ ఊస్ట్..! లక్నో యాజమాన్యం నిర్ణయం..?
మళ్ళీ కేసును రీ ఓపెన్ చేస్తోంది రాజస్థాన్ కోర్ట్. తాజాగా సల్మాన్ ఇంటి వద్ద మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ ఖాన్ ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన కేసులో ముంబై పోలీసులు ఒక మహిళను, యువకుడ్ని అరెస్ట్ చేసారు. నిందితులు మంగళవారం, బుధవారం బాంద్రా (పశ్చిమ)లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌లోకి వెళ్లేందుకు వేరు వేరుగా ప్రయత్నాలు చేసారని పోలీసులు వివరించారు. నిందితులు.. జితేంద్ర కుమార్ సింగ్ (23), ఇషా ఛబ్రా (32) గా గుర్తించారు.
Also Read : అతడికి ఛాన్స్ పక్కా.. గంభీర్ డిసైడ్ అయ్యాడా..?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్ కు చెందిన జితేంద్ర కుమార్ సింగ్.. మంగళవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సల్మాన్ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ ఉన్న పోలీసులు.. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పగా.. సింగ్.. ఫోన్ నేలకేసి కొట్టడం గమనార్హం. అదే భవనంలో.. నివాసం ఉండే వ్యక్తి కారులో అతను అక్కడికి వచ్చినట్టు గుర్తించారు. తాను సల్మాన్ ఖాన్ ను కలవాలని అనుకుంటున్నా అని.. తనను అనుమతించకపోవడంతోనే.. అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నం చేశా అని చెప్పుకొచ్చాడు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. 2023లో, జాతీయ దర్యాప్తు సంస్థ.. చెప్పిన వివరాల ప్రకారం.. బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టు లో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉన్నాడు.