ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైఎస్ జగన్ కు రాజకీయంగా గడ్డు పరిస్థితి ఉన్న మాట అక్షరాలా నిజం. రాజకీయంగా ఒక వెలుగు వెలిగి… అధికారంలో తాను ఏం చేయగలనో అన్ని విధాలుగా చూపించిన జగన్… అధికారం పోవడంతో ఇప్పుడు కొన్ని సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నువ్వు చేసిన పాపాలు నీకు తగులుతాయి అన్నట్టు ఒకప్పుడు జగన్ చేసిన రాజకీయమే ఇప్పుడు టీడీపీ కూడా చేయడం మొదలుపెట్టింది. తిరుమల లడ్డు వ్యవహారం ఇంకా సమసిపోలేదు. ఏ మలుపు తిరుగుతుందో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది.
ఈ సమయంలో జగన్ రాష్ట్రంలో ఉండకుండా కర్ణాటక వెళ్ళిపోయారు. అసలు జగన్ ఎందుకు పదే పదే కర్ణాటక వెళ్తున్నారో కూడా ఎవరికీ ఒక అవగాహన లేదు. అయితే జగన్ తన కార్యాకలాపాలు మొత్తం బెంగళూరు ప్యాలెస్ నుంచే ఈ 5 ఏళ్ళు నడిపే విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. బెంగళూరులో ఉంటేనే తనకు సేఫ్ అని భావిస్తున్న జగన్… ఫోన్ ట్యాపింగ్ తో పాటుగా కొన్ని విషయాల్లో ఆందోళనగా ఉన్నారట. అందుకే మూడు నెలల కాలంలో 11 సార్లు బెంగళూరు వెళ్లి టూరిస్ట్ గా రాష్ట్రానికి వస్తున్నారు.
Read Also : ఐఫోన్ కోసం డెలివరీ ఏజెంట్ హత్య
ఇక తాను అక్కడి నుంచి వచ్చే ముందు ఏ నేతలు తన వద్దకు రావాలో ముందే చెప్తున్నారు. పలానా సమయం కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏం చేయాలో జగన్ చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఎక్కువ సమయం కూడా ఆయన తాడేపల్లి లో ఉండటానికి ఇష్టపడటం లేదు. బెంగళూరు వెళ్తే సమాచార భద్రతతో పాటు వ్యక్తిగత భద్రత కూడా ఉంటుందని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఉంటే ప్రైవేట్ భద్రత పెట్టుకుంటే మీడియా హడావుడి చేసే అవకాశం ఉంది. అందుకే పులివెందుల నుంచి బెంగళూరుకి వ్యక్తిగతంగా మనుషులను పిలిపించి భద్రత ఏర్పాటు చేసుకున్నారట జగన్. ఇక తాడేపల్లిలో ఉంటే జగన్ ఎక్కడికి అయినా రహస్యంగా వెళ్ళాలి అంటే సాధ్యం కాకపోవడం కూడా ఇబ్బంది అయిందట. 5 ఏళ్ళ తర్వాత అధికారంలోకి రాలేకపోతే ఎక్కడ ఉంటారో చూడాలి.