Monday, October 27, 2025 06:07 PM
Monday, October 27, 2025 06:07 PM
roots

గట్టిగానే సంక్రాంతి పోటీ.. ఇవి ఫిక్స్..!

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి పెద్ద పండుగ. మూడు రోజుల పాటు వైభవంగా సకుటుంబ సపరివారంగా జరుపుకునే పెద్ద పండుగ. సంక్రాంతి కోసం 3 నెలల ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటారంటే.. ఆ పండుగ తెలుగు వారికి ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నగరాలు బోసిపోతాయి. ప్రతి ఒక్కరూ పల్లె బాట పడతారు. సొంత ఊరిలో కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆనందంతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. కోడిపందాలు, పిండి వంటలతో పాటు సినిమా పండుగ కూడా గ్రాండ్‌గా జరుపుకోవటం తెలుగు వారికి తొలి నుంచి వస్తున్న ఆనవాయితీ. అందుకే సంక్రాంతికి తమ సినిమా ఉండేలా బడా హీరోలు, దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తారు. ఈసారి సంక్రాంతి రేసులో బడా సినిమాలు పోటీ పడుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాలు మొదలు.. చిన్న సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

Also Read : ఇవి తిన్నా.. తాగినా కిడ్నీల్లో రాళ్ళు గ్యారెంటీ..!

అన్నిటికంటే ముందు ఈ సంక్రాంతి రేసులో ప్రభాస్ హీరోగా వస్తున్న “ది రాజా సాబ్” నిలవనుంది. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరర్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా లవర్స్‌ను కూడా ఆకట్టుకుంది. ఇక రాజాసాబ్ టాలీవుడ్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుందని ఇప్పటికే ఫిలిం ఇండస్ట్రీలో టాక్. కల్కి తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. రాజా సాబ్ మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా వస్తున్న మరో సినిమా “జన నాయకుడు”. ఈ సినిమా కూడా జనవరి 9వ తేదీనే విడుదల కానుంది. టీవీకే పార్టీ ప్రారంభించిన విజయ్ తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయనున్నారు. జన నాయకుడు విజయ్ చివరి సినిమా అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా పూర్తిగా రాజకీయ కోణంలో ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి.. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే మాట వినిపిస్తోంది.

ఇక జనవరి 12న మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ఇప్పటికే దర్శక, నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన గ్లిప్స్, స్టిల్స్ సినిమా ఎలా ఉంటుందో అనే అంచనాలను పెంచేసింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన మీసాల పిల్ల లిరికల్ సాంగ్ కూడా యూ ట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. నయన తార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న కొత్త సినిమా #RT76. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు.

Also Read : వరల్డ్ కప్‌కు మేం రెడీ.. రోకో క్లారిటీ..!

ఇక వీటితో పాటు మరో రెండు సినిమాలు కూడా సంక్రాంతి రేసులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న సినిమా “అనగనగా ఒకరాజు”. ఈ సినిమా ప్రమోషన్ వర్క్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటోంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న “అనగనగా ఒకరాజు” సినిమాను జనవరి 14 ప్రేక్షకుల ముందు తీసుకువచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు శర్వానంద్ హీరోగా వస్తున్న “నారీ నారీ నడుమ మురారి” సినిమా కూడా సంక్రాంతి పండుగకే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి రేసులో శర్వానంద్‌కు ప్రత్యేక ట్రాక్ రికార్డు ఉంది. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు పోటీగా శతమానం భవతితో సూపర్ హిట్ కొట్టారు శర్వానంద్. ఇప్పుడు కూడా అదే మాదిరిగా నారీ నారీ నడుమ మురారితో హిట్ ఖాయమనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతి పండుగ సినిమా లవర్స్‌కు కన్నుల పండుగగా ఉంటుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. మరి థియేటర్ల సమస్యను దర్శక నిర్మాతలు ఎలా అధిగమిస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

ఆర్టీసీ బస్సు తప్పింది.....

కర్నూలు రోడ్డు ప్రమాదం ఘటన విషయంలో...

బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు...

సాధారణంగా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం...

పోల్స్