సందీప్ రెడ్డి వంగతో సినిమా అంటే మామూలు విషయం కాదు. సినిమా రిజల్ట్ బాగుండాలి అంటే సందీప్ చెప్పింది చేయాల్సిందే. వేరే డైరెక్టర్లు మాదిరిగా హీరో కి భజన చేసే రకం కాదు సందీప్ రెడ్డి వంగ. హీరో నుంచి తన సినిమాకు ఏం కావాలో అది పట్టుబట్టి మరీ లాక్కునే రకం. అందుకే అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సినిమాలు రికార్డులు బ్రేక్ చేశాయి. సరికొత్త రికార్డులకు క్రియేట్ చేశాయి.
Also Read : ఇక ఆ సీనియర్ నేత కథ ముగిసినట్లేనా..!
ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ తో సినిమా అంటే సందీప్ రెడ్డి వంగ… వంగి వంగి ఉంటాడని చాలామంది ఆశించారు. కానీ సినిమా మాత్రం డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే స్పిరిట్ విషయంలో సందీప్ రెడ్డి వంగా ఎప్పటినుంచో ప్లాన్ తో ఉన్నాడు. అసలు ఆ సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటాడో.. తాను రివీల్ చేసే వరకు బయటకు రాకూడదు అనేది సందీప్ రెడ్డి ఉద్దేశం. అందుకే ఈ సినిమా చేసే సమయంలో ప్రభాస్ ఎలా ఉంటాడు ఏంటి అనేది అర్థం కాకుండా ఉండేందుకు వేరే సినిమాలు కూడా చేయవద్దు అని చెప్పేసాడు.
Also Read : దారుణం.. 150 మందిని హత్య చేసిన హైజాకర్స్..!
అలాగే లేట్ అయినా సరే.. బల్క్ కాల్ షీట్లు కావాలి అని.. బాడీ డబుల్స్ పై ఆధారపడి షాట్లు తీయకూడదని.. డూప్ అనే ప్రస్తావన అసలు ఉండకూడదని.. సందీప్ రెడ్డి స్పష్టంగా చెప్పేసాడు. దీనికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత.. సందీప్ రెడ్డి వంగతో సినిమా మొదలవుతుంది. ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే మ్యూజిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. త్వరలోనే సినిమా షూటింగ్ గురించి అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ కాస్త రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్ కు కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది.




