ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా వైసీపీ టార్గెట్ చేసింది అనేది చాలామంది క్లారిటీ ఉంది. కమ్మ సామాజిక వర్గ టార్గెట్ గా లేనిపోని ఆరోపణలను అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ కూడా చేసారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ అడ్డుకుంటే కమ్మ సామాజిక వర్గం కుట్ర చేస్తుందంటూ ప్రచారం చేసింది వైసిపి. ఆ తర్వాత భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కనుక్కున్న సమయంలో కూడా ఇదే విధంగా ఆరోపణలు చేసి.. అది కరోనా వ్యాక్సిన్ కాదు కమ్మ వ్యాక్సిన్ అంటూ ఆరోపణలు కూడా చేశారు.
Also Read : టార్గెట్ బడా నిర్మాతలు.. హైదరాబాద్ లో భారీగా ఐటి సోదాలు..!
ఇక వైసిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పదేపదే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్రమైన ఆరోపణలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీడియా సంస్థలను అలాగే విజయవాడలో వ్యాపారాలు చేసుకునే కమ్మ సామాజిక వర్గం వారిని టార్గెట్ గా చేసుకొని తీవ్రస్థాయిలో వైసిపి ఆరోపణలు చేసిన సందర్భాలు కోకోల్లలు.. అయితే ఇప్పుడు తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎక్కువగా హైలెట్ చేసే ప్రయత్నం చేస్తుంది.
కమ్మ సామాజిక వర్గం గురించి ఆయన చేసిన కామెంట్స్ పై ఒక కథనం రాసిన సాక్షి… అందులో మంచి, మర్యాదలు కులం.. గౌరవం వంటి పదాలను వాడుతూ ఏబీ వెంకటేశ్వరరావు పై విమర్శలు చేసింది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు చూసి ఎవరైనా దాడులకు దౌర్జన్యాలకు దిగితే పరిస్థితి ఏంటి అంటూ ఒక రకమైన ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఇక పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయాలనే డిమాండ్ కూడా సాక్షి లేవనెత్తింది. ఒక సమావేశంలోనే ఏబి వెంకటేశ్వరరావు పై కేసులు నమోదు చేస్తే… మాజీ ముఖ్యమంత్రి జగన్ పై పదేపదే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినందుకు ఎన్ని కేసులు నమోదు చేయాలని సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
Also Read : ఏపీ, తెలంగాణా మధ్య కృష్ణా జలాల రచ్చ…? పరిష్కారం దొరికేనా…?
ఆ లెక్కన విజయసాయిరెడ్డి జీవితాంతం జైల్లోనే ఉండాలని.. ఆయనను ప్రోత్సహించినందుకు వైయస్ జగన్ కూడా జైల్లోనే గడపాలని మరి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి ఆధారాలు లేకుండా పోలీస్ అధికారులు కమ్మ సామాజిక వర్గం వారంటూ అప్పట్లో జగన్ చేసిన ఆరోపణలకు ఏ శిక్షలు వేయాలని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. టిడిపిని ఎదుర్కోవడానికి కమ్మ సామాజిక వర్గాన్ని వైసీపీ టార్గెట్ చేసిన విషయాన్ని సాక్షి మర్చిపోవడం సిల్లీగా ఉందని మరి కొంతమంది తిడుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు పై నిజంగా కేసు నమోదు చేస్తే ముందు జగన్ పై వైసీపీ నేతలు ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్లు చేస్తున్నారు.