Friday, September 12, 2025 05:19 PM
Friday, September 12, 2025 05:19 PM
roots

టిష్యూ పేపర్ విష ప్రచారం..!

తాను చేస్తే సంసారం.. ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అన్నట్లు ఉంటుంది వైసీపీ తీరు. అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు అడ్డగోలుగా వ్యవహరించిన జగన్ సర్కార్.. ఇప్పుడు మాత్రం నీతి మాటలు చెబుతోంది. పదవుల కేటాయింపులో రూల్స్ మొత్తాన్ని తుంగలో తొక్కింది వైసీపీ. అసలు సిసలైన వారిని పూర్తిగా పక్కన పెట్టింది. తమకు భజన చేసిన వారికే పెద్ద పీట వేసింది. చివరికి ఆర్టీఐ కమిషనర్‌గా జగన్ నామస్మరణ చేసిన రిపోర్టర్‌ను ఎంపిక చేశారు. అలాగే వైసీపీకి, జగన్‌కు వ్యతిరేకంగా వార్తలు రాసిన మీడియాను, ప్రతినిధులను కనీసం సచివాలయం గేటు కూడా దాటనివ్వలేదు. ఇక సీఎం ప్రెస్ మీట్ అంటే.. కేవలం ఓ పది మందికి మాత్రమే అనుమతి. మిగిలిన వారికి నో ఎంట్రీ. ఇలా మీడియా స్వేచ్ఛను అడ్డుకున్నారు. ఆంక్షలు విధించారు. కొన్ని ఛానళ్లు ఏపీలో టెలికాస్ట్ కాకుండా అడ్డుకున్నారు. ఎమ్మెస్‌వోలను కూడా బెదిరించారు. చివరికి పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చే అక్రిడేషన్ కార్డుల జారీలో కూడా రూల్స్ బ్రేక్ చేసి.. కేవలం ప్రభుత్వ భజన చేసే వారికే ఇచ్చారు తప్ప.. మిగిలిన వారిని పక్కన పెట్టేశారు.

Also Read : ఇంటరెస్టింగ్ గా టెస్ట్ టీం సెలెక్షన్.. కొత్త ఆటగాళ్ళు ఎవరు..?

ఏపీలో ప్రభుత్వం మారింది. మీడియాకు స్వేచ్ఛ వచ్చింది. ఇందుకు సాక్ష్యం.. వైసీపీ అధికారిక కరపత్రం సాక్షి. ప్రభుత్వంపై కావాల్సినన్ని తప్పుడు రాతలు రాస్తోంది. అయినా సరే.. ఎలాంటి చర్యలు లేవు. ఇక సాక్షి ఛానల్ ఇప్పటికీ అన్ని కేబుల్ నెట్‌వర్క్ లలో టెలికాస్ట్ అవుతూనే ఉంది. ఎలాంటి ఆంక్షలు లేవు. ఎలాంటి బెదిరింపులు లేవు. తప్పుడు వార్త ప్రసారం చేసినా సరే.. ప్రభుత్వం మాత్రం ఆంక్షలు పెట్టలేదు. అయితే తాజాగా సాక్షి పత్రిక ఓ విషయంలో నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే.. వాస్తవాలు మర్చిపోయి మరి అడ్డగోలుగా రాతలు రాస్తోంది. జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను పక్కన పెట్టి ఇప్పుడు ఏదో జరిగిపోయిందంటూ గగ్గొలు పెడుతోంది.

Also Read : స్కాంలో లేము.. కేసిరెడ్డి టు కృష్ణమోహన్ రెడ్డి.. ఎవరిని ఇరికిస్తున్నట్టు..?

ఏపీలో 22 నామినేటెడ్ పదవులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఈ కేటాయింపులో కూటమిలోని జనసేన, బీజేపీలకు కూడా ఒప్పందం ప్రకారమే పదవులు కేటాయించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి, సీనియర్ నేతలకు, గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వారికే పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. అయితే నామినేటెడ్ పదవుల కేటాయింపుపై సాక్షి మీడియా విషం కక్కుతోంది. ముఖ్యంగా ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఎంపికపై సాక్షి రాసిన రాతలు రోత పుట్టిస్తున్నాయి. ఊరంతా ఒక దారి అయితే.. ఉలిపిరి కట్టెది మరో దారి అన్నట్లుగా.. సరైన వారికే పదవులు అంటూ అన్ని పత్రికలు రాస్తే.. ఒక్క సాక్షి మాత్రం.. మరోసారి యాక్ ఛీ అనేలా రాసుకొచ్చింది.

Also Read : బ్రేకింగ్: ఏపీ లిక్కర్ స్కాంలో షేకింగ్ న్యూస్

ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా సీనియర్ పాత్రికేయులు ఆలపాటి సురేష్‌ను ఎంపిక చేసింది కూటమి ప్రభుత్వం. దీనిపై సాక్షి మాత్రమే నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేసింది. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పుస్తకాలు రాయడంతో పాటు వీడియోల ద్వారా విష ప్రచారంతో తనకు దగ్గరైన ఆలపాటి సురేష్‌ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా నియమించారు. అంటూ వార్తలో రాసుకొచ్చింది సాక్షి. వాస్తవానికి ఆలపాటి సురేష్ నిన్నో మొన్నో పాత్రికేయ వృత్తిలోకి రాలేదు. దాదాపు 40 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రభ వంటి పత్రికలతో పాటు టీవీ 9 లో కూడా ఉన్నతస్థాయి పదవులు నిర్వహించారు. ఎక్కడా కూడా ప్రభుత్వానికి భజన చేయలేదు. జరిగింది జరిగినట్లుగా ప్రజలకు వివరించారు. వాస్తవానికి ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చింది 2019లో. కానీ ఆంధ్రప్రభ పత్రిక ప్రారంభమైంది 1939లోనే. మరో విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రభ పత్రిక కాంగ్రెస్ అనుకూలం అనే పేరు కూడా ఉంది. ఈ పత్రిక నాటి ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎన్నో కథనాలను కూడా ప్రచురించింది. ఇక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ9 ప్రారంభమైంది 2003లో. ప్రారంభమైన తొలి నాళ్ల నుంచే నాటి కాంగ్రెస్ పెద్దలకు దగ్గరగా వ్యవహరించింది అనే ముద్ర ఉన్న మీడియా.

Also Read : ప్రపంచ కప్ కష్టమే.. గవాస్కర్ సంచలన కామెంట్స్

అయితే ఆలపాటి సురేష్ మాత్రం.. యాజమాన్యం సూచనలు, ఆదేశాలు తూచా తప్పకుండా పాటించారు. ఎక్కడా తన వృత్తి ధర్మాన్ని వీడలేదు. నాటి ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను నిర్భయంగా ఎత్తిచూపారు. ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలపై ఎంత కఠినంగా ఉన్నారో.. ప్రజోపయోగ నిర్ణయాలపై కూడా అదే మాదిరిగా వ్యాఖ్యలు చేశారు. తన వృత్తి ధర్మంలో భాగంగానే వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించేందుకు విధ్వంసం పేరుతో 600 పేజీల పుస్తకం రచించారు. ప్రత్యేక హోదా ప్రగల్భాలు, కోడెలపై విష ప్రచారం, మీడియాపై కత్తి, దళిత వైద్యుడి అంతు చూసిన విధానం, ప్రజా వేదిక కూల్చివేత, రాజధాని అమరావతిపై విషం, మూడు రాజధానుల పేరుతో తుగ్లక్ నిర్ణయం, రాజు గారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం, గంజాయి రాజ్యం, అమరావతి రైతులపై దాడులు, మహిళలను బూటు కాలితో తన్నిన పోలీసులు… ఇలా జగన్ సర్కార్ చేసిన దారుణాలను 600 పేజీల విధ్వంసం పుస్తకం రూపంలో ఓ జర్నలిస్టు వ్యాఖ్య అంటూ ప్రజలకు వాస్తవాలు వెల్లడించారు. వీటిల్లో ఏ ఒక్కటి తప్పున్నా సరే.. తనపై చర్యలు తీసుకోవచ్చు అంటూ సవాల్ కూడా చేశారు. ఇలా నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఆలపాటి సురేష్‌కు ఇప్పుడు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చారు చంద్రబాబు.

Also Read : పట్టు బిగిస్తున్న కాంగ్రెస్.. మోడీ దొరికిపోయారా..?

మరి జగన్ ప్రభుత్వం.. సాక్షి మీడియాలో పని చేసే ఉద్యోగి కొమ్మినేని శ్రీనివాస్‌ను ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ పీఠంపై కూర్చొబెట్టారు. తన సొంత సంస్థలో ఉద్యోగికి ఎలా ఉన్నత పదవి ఇస్తారు అంటే.. నో ఆన్సర్. మరి ఆలపాటి సురేష్ మాత్రం ప్రస్తుతం వైసీపీ చెబుతున్నట్లుగా.. ఏ మీడియా సంస్థలో లేరు. ప్రభుత్వ నిర్ణయాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. అలాగే జర్నలిస్ట్ యూనియన్ నాయకులుగా.. పాత్రికేయుల సంక్షేమానికి పాటుపడుతున్నారు కూడా. మరి కొమ్మినేని పేరు ప్రకటించినప్పుడు ఆహా ఓహో.. అంటూ గొప్పగా రాసుకొచ్చిన సాక్షి.. ఆలపాటి పేరు వినగానే.. విష ప్రచారం, పుస్తకాలు రాయడం.. అంటూ కొత్త కొత్త ఆరోపణలు చేస్తోంది. అందుకే ఏపీ ప్రజలు ముద్దుగా టిష్యూ పేపర్ అనేది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్