ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతులను పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే. కమ్మ రాజధాని, రియల్ ఎస్టేట్ రాజధాని, టిడిపి నాయకుల రాజధాని అంటూ వైసీపీ పెద్ద ఎత్తున అమరావతి విషయంలో అప్పట్లో తప్పుడు ప్రచారానికి దిగడం పై టిడిపి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇక స్థానిక ప్రజల నుంచి కూడా ఈ విషయంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం చూసాం. మూడు రాజధానుల పేరుతో అమరావతి, కర్నూలు, విశాఖపట్నం ప్రాంతాలను రాజధానులుగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.
Also Read : మెడికల్ కాలేజీల వార్.. అసలు నిజాలేమిటో..?
ఆ తర్వాత అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. రాయలసీమ ప్రాంత వాసులు కూడా తమకు రాజధాని వద్దు అనే వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో కేవలం న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించడాన్ని రాయలసీమ ప్రజలు కూడా తిరస్కరించారు. ఇక విశాఖలో కూడా రాజధాని పేరుతో భూములను ఆక్రమించుకుంటున్నారు అనే ఆరోపణలు సైతం వినిపించాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇది కూడా ఒక కారణమనే అభిప్రాయాలు సైతం వినిపించాయి.
Also Read : ఇదేం ప్రెస్ మీట్ అన్న..? షాక్ అవుతున్న జర్నలిస్ట్ లు
2019 ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడారు జగన్. అయితే తాజాగా దీనిపై వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు అనే అంశం ఇక లేదని.. కేవలం ఒక రాజధాని మాత్రమే ఉంటుందన్నారు. అమరావతి లోనే తాము అభివృద్ధి చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే గుంటూరు విజయవాడ మధ్యలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ప్రకటించారు. రైతులకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ అమరావతి నుంచి పరిపాలన కొనసాగిస్తారని.. గుంటూరు విజయవాడ మధ్యలో మహానగర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఖర్చు తగ్గించి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు సజ్జల.