Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

అది సంకర జాతి కాదా సజ్జల..?

అమరావతి ప్రాంత మహిళల విషయంలో సాక్షి ఛానల్ లో నిర్వహించిన ఒక డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయింది. తల్లి లాంటి రాజధానిపై ఆ విధంగా ఎలా మాట్లాడుతారు అంటూ అధికార పార్టీలు మండిపడుతున్నాయి. ఇక సామాన్య ప్రజల్లో సైతం ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం అయింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. సాక్షి ఛానల్ ప్రసారాలను రాష్ట్రంలో నిలిపివేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

Also Read : చినాబ్ వంతెనలో తెలుగు మహిళ కృషి.. ప్రముఖుల ప్రశంసలు

ఇక తాజాగా డిబేట్ నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావును తుళ్లూరు పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. కొమ్మినేని అరెస్టు విషయంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరికి బయటకు వచ్చి ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయంలో కొమ్మినేని శ్రీనివాసరావు తప్పు లేకపోయినా ఆయనను అరెస్టు చేశారని.. కావాలనే ఆయనను రాజకీయ కక్ష సాధింపుతో వేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందని మండిపడుతున్నారు. ఇక దీనికి మద్దతుగా వైసిపి కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసుల తీరును తప్పుపట్టారు.

Also Read : భారతీ మేడం.. సారి.. తప్పైంది.. మన్నించండి ప్లీజ్..!

అదేవిధంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న వారిని సంకరజాతిగా ఆయన అభివర్ణించడం వివాదాస్పదంగా మారింది. ఫోటోలను చెప్పుతో కొట్టారని కావాలనే విద్వేష పూరితంగా రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. అయితే దీనిపై అధికార పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ సమావేశాలు నిర్వహించిన సమయంలో చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆ పార్టీ నాయకుల ఫోటోలను కాళ్లతో తొక్కి వికృతి చేష్టలు చేశారు వైసీపీ కార్యకర్తలు. టిడిపి జనసేన కలిపి నిర్వహించిన సమావేశం అనంతరం.. చంద్రబాబు ఫోటోను అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోలను కాళ్లతో తొక్కి వికృతానందం పొందారు. మరి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ దాక్కున్నారని.. అది సంకరజాతి కాదా అంటూ మండిపడుతున్నారు టిడిపి కార్యకర్తలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్