జాతీయ జట్టుకు ఆడాలంటే అదృష్టం ఉండాలి. క్రికెట్ లో ఇది కాస్త ఎక్కువగా ఉండాలి. అలాగే సోషల్ మీడియాలో హడావుడి కూడా ఎక్కువగా చేయాలి. పీఆర్ టీమ్స్ తో సందడి చేస్తూ ఉండాలి. ఈ విషయంలో పక్కాగా వెనుకబడ్డాడు సాయి సుదర్శన్. అవకాశం వచ్చిన ప్రతీసారి నిలకడగా రాణిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు ఈ తమిళనాడు ఆటగాడు. ఐపిఎల్ లో ఓపెనర్ గా వస్తూ ప్రతీ మ్యాచ్ లో సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు.
Also Read : బీసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టు ఇదే
ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడుతున్న సాయి సుదర్శన్.. ఆ జట్టులో అత్యంత కీలక ఆటగాడిగా మారిపోయాడు. అతను ఆడితేనే ఆ జట్టు విజయం సాధించే పరిస్థితి ఏర్పడింది. గత సీజన్లలోనే తనదైన ముద్ర వేసిన ఈ తమిళనాడు ఆటగాడు.. ఈ సీజన్ లో మరింత పట్టుదలగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా 150కి పైగా స్ట్రైక్ రేట్ తో 417 పరుగులు చేశాడు సాయి సుదర్శన్. దీనిలో 5 హాఫ్ సెంచరీలు చేసాడు. ఈ గణాంకాలు చాలు అతను ఏ స్థాయిలో రాణిస్తున్నాడో చెప్పడానికి.
Also Read : అసలు దొంగ బీహార్ పారిపోయాడు: రఘురామ
వన్డే క్రికెట్ తో పాటుగా టెస్ట్ ఫార్మాట్ కు కూడా అతను సరిగా సరిపోయే ఆటగాడు. మిడిల్ ఆర్డర్ అయినా టాప్ ఆర్డర్ లో అయినా సరే సమర్ధవంతంగా ఆడే సామర్ధ్యం ఉన్న ఆటగాడు. దీనితో అతను ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లాలని అభిమానులు కోరుతున్నారు. ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచుల్లో సైతం ఆడిన అనుభవం అతని సొంతం. కౌంటీ యాజమాన్యాలు కూడా అతన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రాబోయే ఇంగ్లాండ్ సీరీస్ భారత్ కు అత్యంత కీలకం. కాబట్టి అతన్ని ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్.