భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ దంఖర్ రాజీనామా చేసిన తర్వాత, ఆ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపుగా ఎన్డియే ఈ ఎన్నికల్లో గెలవడం దాదాపుగా ఖాయమే. దీనితో దేశంలో రెండవ అత్యున్నత పదవికి ఎవరిని ఎంపిక చేయవచ్చు అనే దానిపై చాలా పేర్లు వినిపించాయి. కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పేరు కూడా వినపడింది. పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆయన రాజీనామా చేయడంతో.. రాజకీయ దుమారం కూడా రేగింది.
Also Read : ఎమ్మెల్యే కూన రవికుమార్ తో బోస్టన్ ప్రవాసాంధుల ఆత్మీయ సమావేశం
ఇప్పుడు ఈ పదవికి కొత్త పేరు వినపడుతోంది. తమిళనాడుకు చెందిన జర్నలిస్ట్, ఆర్ఎస్ఎస్ సభ్యుడు శేషాద్రి చారి పేరు వినపడింది. దాదాపుగా ఆయనను ఎంపిక చేయడం లాంచనం అంటున్నాయి కేంద్ర వర్గాలు. తమిళనాడు ఎన్నికలకు ముందు ఈ పరిణామం మరింత ఆసక్తిని రేపుతోంది. రాబోయే తమిళనాడు ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలని బిజెపి పెద్దలు భావిస్తున్నారు. దీనితోనే శేషాద్రి చారి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Also Read : రేషన్ అక్రమాలతో తలనొప్పి.. రెచ్చిపోతున్న మాఫియా..!
ముంబైలో పుట్టిన ఆయన తమిళనాడుకు చెందిన బ్రాహ్మణ సామాజిక వర్గ వ్యక్తి. ముంబైలో తమిళులు ఎక్కువగా ఉండే మాతుంగాలో జన్మించిన చారి.. బొంబాయి యూనివర్సిటీలో ఉన్నత చదువులు చదివారు. అక్కడే సంఘ్ పరివార్ నేతలకు దగ్గరయ్యారు. హిందుత్వ భావాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళే విధంగా ఆయన రచనలు ఉండేవి. ఆర్‌ఎస్‌ఎస్ వారపత్రిక ఆర్గనైజర్ సంపాదకుడిగా చారి పాపులర్ అయ్యారు. 1988 తర్వాత ఆయన బిజెపిలో జాయిన్ అయ్యారు. ఎమర్జెన్సీ టైం లో జైలుకు కూడా వెళ్ళారు.