Saturday, September 13, 2025 01:09 AM
Saturday, September 13, 2025 01:09 AM
roots

రోహిత్ టెస్ట్ కెరీర్ గురించి ఈ విషయం తెలుసా..?

గత ఏడాది పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్న ఈ ముంబై ఆటగాడు.. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం సాయంత్రం ప్రకటించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు కొన్ని చూద్దాం. 2013 లో తొలి టెస్ట్ ఆడిన రోహిత్ శర్మ.. వాస్తవానికి 2010 లోనే తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాని గాయం కారణంగా ఆడలేకపోయాడు.

Also Read :ఆపరేషన్ సిందూర్.. ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇదే

అయితే, 2010లో నాగ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌కు టాస్ వేయడానికి కొన్ని నిమిషాల ముందు చీలమండ గాయం కారణంగా అతను ఆడలేకపోయాడు. గాయం కారణంగా తన సొంత మైదానంలో టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. దీనితో వృద్ధిమాన్ సాహా అప్పుడు టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. రెండు సంవత్సరాల తరువాత, 2011-12లో పెర్త్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడవ మ్యాచ్‌లో రోహిత్ మరోసారి తన టెస్ట్ అరంగేట్రం చేస్తాడని భావించారు.

Also Read :ఆపరేషన్ సక్సెస్.. దెబ్బ అదుర్స్..!

సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ ఆకట్టుకోలేకపోవడంతో.. మూడవ టెస్ట్‌కు అతని స్థానంలో రోహిత్ శర్మ ఆడతాడని భావించారు. కాని కెప్టెన్ ధోనీ మాత్రం, కోహ్లీ జట్టులో ఉండాలని పట్టుబట్టాడు. దీనితో రోహిత్ అరంగేట్రం మరింత ఆలస్యం అయింది. రోహిత్ చివరకు కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన తొలి టెస్టులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ఆ తర్వాత రెండో టెస్టులో మరో సెంచరీ సాధించడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్