ఈ రోజుల్లో దీర్ఘకాలిక అనారోగ్యం అనేది అత్యంత సాధారణ విషయంగా మారిపోయింది. షుగర్, బీపీ లేదా ఇతర వ్యాధులు చిన్న వయసు వారిని కూడా ఇబ్బంది పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా దీనికి సంబంధించి ఓ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. బాల్యంలో ఊబకాయం, సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు ఆందోళనకర స్థాయిలో పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవన శైలి కారణంగా ఈ వ్యాధులు చిన్న వయసు వారికి కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని ముంబైలోని పోవైలోని డాక్టర్ ఎల్హెచ్ హిరానందిని హాస్పిటల్, కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ గణేష్ కుమార్ ఎవి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
Also Read : సంచలనం.. తిరుమలలో మరో అపచారం బహిర్గతం
ఈ సమస్యలు తరచుగా 12 నుండి 14 సంవత్సరాల వయస్సు మధ్య ప్రారంభమవుతాయని ఆయన హెచ్చరించారు. పిల్లలు అధిక కేలరీలను, ప్రధానంగా జంక్ ఫుడ్, శీతల పానీయాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్ ను రూపంలో తీసుకుంటున్నారు అని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, పదే పదే స్నాక్స్ తినడం కూడా ప్రమాదకరం అని హెచ్చరించారు. ఈ రోజుల్లో విద్యపై దృష్టి పెట్టిన తల్లి తండ్రులు క్రీడలపై దృష్టి పెట్టడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read : మర్రి రాకతో గుబులు మొదలైందా..?
దీనితో ఊబకాయం సమస్య తీవ్రమవుతుందని ఆయన పేర్కొన్నారు. కంప్యూటర్ లేదా ఫోన్ వాడటంతో శారీరక వ్యాయామం కరువైపోయిందని, ఇది ఊబకాయం ఆ తర్వాత టైప్ 2 డయాబెటిస్ కు దారి తీస్తుందని హెచ్చరించారు. భారత్ ఇప్పటికే షుగర్ కు రాజధానిగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. జంక్ ఫుడ్ విధానం మారకపోతే మాత్రం యువత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సిందేనని హెచ్చరించారు. ఊబకాయాన్ని తక్కువ అంచనా వేయవద్దని, ఇన్సులిన్ ఉత్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వెల్లడించారు.