Saturday, September 13, 2025 12:24 PM
Saturday, September 13, 2025 12:24 PM
roots

కేజిఎఫ్ లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహం ఇదేనా?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒకసారి చూస్తే… సామాజిక వర్గాల లెక్కలు బయటకు తీస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా కమ్మ సామాజికవర్గ ప్రభావం అనేది రెడ్డి సామాజిక వర్గంతో పోలిస్తే తక్కువ అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడక ముందే తమిళనాడు కేంద్రంగా జరిగిన రాజకీయాల్లో కమ్మవారి ప్రభావం ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే కమ్మ సామాజిక వర్గ ప్రభావం తెలుగు రాజకీయాల్లో గాని, దేశ రాజకీయాల్లో గాని పెరిగింది అనే మాట వాస్తవం. అయితే కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందుండి నడిపించినన్ని రోజులు కూడా కమ్మ సామాజిక వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేసారనే కామెంట్స్ వినిపించాయి.

ఇక వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అడుగడుగునా కూడా కమ్మ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే రాజకీయం నడిచింది. కమ్మ సామాజిక వర్గ అధికారులను అత్యంత దారుణంగా వేధించిన ఘనత కూడా జగన్ కే దక్కుతుంది. ఇక తెలంగాణా విషయానికి వస్తే… రెడ్డి సామాజిక వర్గానికి అప్పటి సిఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారనే అభిప్రాయం ఉంది.

తెలంగాణాలో రెడ్డి సామాజిక వర్గంతో పాటుగా కమ్మ సామాజిక వర్గ జనాభా గణనీయంగా ఉన్నా సరే గత కెసిఆర్ ప్రభుత్వంలో సరైన గుర్తింపు దక్కలేదనే ఆవేదన ఆ సామాజిక వర్గంలో ఉంది. రేవంత్ రెడ్డి సిఎం అభ్యర్ధిగా ఉండటం, ఆయన చంద్రబాబుకి సన్నిహితుడు కావడంతో తెలంగాణా ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచింది అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు కూడా బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే సిఎం గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం పరిస్థితి మారింది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాజాగా (కమ్మ గ్లోబల్ ఫెడరేషన్) కేజిఎఫ్ సమావేశానికి హాజరైన సిఎం.. కమ్మ సామాజికవర్గాన్ని ఆకాశానికి ఎత్తేసారు. దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ బలమైన వ్యూహం సిద్దం చేసారని అంటున్నారు. తెలంగాణాలోని దాదాపు 45 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గ ప్రభావం బలంగా ఉంది. వారిలో చాలా మంది తెలుగుదేశం పార్టీని అభిమానించే వారే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి వారిలో ఎక్కువ మంది మద్దతు ఇచ్చారు.

అయితే హైదరాబాద్ లో మాత్రం కమ్మ సామాజిక వర్గ సెటిలర్లు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు వారిని తన వైపుకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కమ్మ సామాజిక వర్గ నేతలకు, వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. వారిలో తనపై ఉన్న అభిమానాన్ని రేవంత్ రెడ్డి కాపాడుకునేందుకు స్థానిక సంస్థల్లో కూడా ప్రాధాన్యత పెంచే వ్యూహం సిద్దం చేస్తున్నారని అంటున్నారు. తన మంత్రి వర్గంలోకి ఆ సామాజికవర్గం నుంచి మరొకరిని తీసుకోవడంతో పాటుగా ఒక సీనియర్ జర్నలిస్ట్ కు కీలక పదవిని కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

పోల్స్