ఇప్పుడు ఏపీలో కడప పార్లమెంట్ స్థానం విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల ఎలా అయినా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమె… వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి ని ఓడించే విధంగా ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఇక ఆమెకు మద్దతుగా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సహకారంతో ప్రచారం గట్టిగానే నిర్వహిస్తున్నారు. ఇక ఆమె సిఎం జగన్ పై చేస్తున్న కామెంట్స్ కూడా ఆసక్తిగానే ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఆమెకు మద్దతుగా మరికొందరు రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటక నుంచి కాంగ్రెస్ అగ్ర నేత… డీకే శివకుమార్ ప్రచారం చేయడానికి సిద్దంగా ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. అలాగే కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారం చేసేందుకు సిద్దమయ్యారు అని సమాచారం. ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డి తో ఆమె చర్చలు కూడా జరిపారని అంటున్నారు. త్వరలోనే రేవంత్… కడప వెళ్లి ప్రచారం చేయనున్నారు.
అలాగే కడపలో మరికొందరు కర్ణాటక, తెలంగాణా కాంగ్రెస్ నేతలు అడుగుపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. తెలంగాణా సీనియర్ నేతలు కూడా కడప వెళ్లి షర్మిలకు మద్దతు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ పరిణామాలు అన్నీ ఇప్పుడు ఆసక్తిగా మారుతున్నాయి. కడప రేవంత్ రెడ్డి వెళ్లి ప్రచారం చేస్తే మాత్రం పరిస్థితి మారే అవకాశం ఉండవచ్చు. ఇది వైసీపీని కచ్చితంగా ఇబ్బంది పెట్టె పరిణామం అంటున్నాయి రాజకీయ వర్గాలు.