Friday, September 12, 2025 10:32 PM
Friday, September 12, 2025 10:32 PM
roots

అక్కడ రేవంత్ ఇక్కడ చంద్రబాబు.. ఎమ్మెల్యేలకో దండం

సాధారణంగా ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఘాటుగా సమాధానాలు చెప్పడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఏపీలో వైసిపి అధికారంలో ఉన్నప్పుడు, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఈగ వాలినా సరే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విపక్షాల పై విరుచుకుపడేవారు.

Also Read : ఎంపీకి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

కానీ ఇప్పుడు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడం లేదు. తిరుమలలో ఇటీవల వైసిపి పెద్ద ఎత్తున గోవుల గురించి ప్రచారం చేసింది. అక్కడ గోశాల లో పర్యవేక్షణ సరిగా లేదని, క్వాలిటీ లేని మందులు, దాణా ఆవులకి ఇస్తున్నారని, వైద్యం కూడా సరిగా అందడం లేదని.. రకరకాల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే అమరావతిలో భూ సేకరణ గురించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా వైసిపి మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు చేస్తూ వస్తోంది. అలాగే పగడాల ప్రవీణ్ వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కొంతమంది విమర్శలు చేశారు.

Also Read : ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ నెవర్ ఎగైన్..!

జరగని విషయాలు జరిగినట్లు ప్రచారం చేస్తూ.. ఆ తప్పులను ప్రభుత్వం పై రుద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఎలక్ట్రానిక్, ప్రింట్ మరియు సోషల్ మీడియాని వాడుకోవడం మొదలు పెట్టింది. వీటిల్లో ఏ ఒక్క విషయంలో కూడా ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గాని మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన పరిస్థితి లేదు. ప్రభుత్వం పై పడ్డ అపవాదులు తుడుచుకోవడం చంద్రబాబు మరియు లోకేష్ బాధ్యత అనుకున్నారేమో టిడిపి ఎమ్మెల్యేలు.. అసలు వీటి సంగతి మాట్లాడటం మర్చిపోయారు. ఇక తెలంగాణలో కూడా కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. వాటిపై ముఖ్యమంత్రి మాట్లాడటమే గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ ఎవరూ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా మాట్లాడలేకపోయారు.

Also Read : మళ్ళీ మొదలైన టీ కాంగ్రెస్ మంత్రి పదవి రచ్చ

దీనికంటే మంత్రి పదవుల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అటు కాంగ్రెస్ ఎంపీలు కూడా దీని గురించి మాట్లాడేందుకు ముందుకు రాలేదు. దీనిపై ఏపీలో చంద్రబాబు నాయుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు పలుమార్లు చెబుతున్నా సరే వారి వ్యవహార శైలిలో మాత్రం మార్పు లేదు. సోషల్ మీడియాలో కార్యకర్తల పోరాటమే గాని నాయకుల ఆరాటం ఎక్కడా కనబడటం లేదు. ఇది ఇలాగే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పెద్ద కష్టం కాదు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్