అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఇబ్బందులకు గురి చేసిన ప్రతి ఒక్కరికీ వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు యువగళం పాదయాత్రలో నారా లోకేష్. తన చేతుల్లో ఉన్న రెడ్ బుక్ చూపించి.. తప్పు చేసిన ప్రతి ఒక్కరి పేరు ఇందులో రాసుకుంటున్నా.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చట్టపరమైన చర్యలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారు. చెప్పినట్లుగానే అధికారం అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలపైన చర్యలు ప్రారంభించింది కూటమి ప్రభుత్వం.
Also Read : రాజీనామాకు సిద్ధమైన అక్క శిష్యులు..? గులాబీ పార్టీలో అలజడి
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై దృష్టి పెట్టింది. మద్యం స్కామ్‌లో సుమారు రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని పార్లమెంట్‌లోనే టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రస్తావించారు. ఈ కేసుపై విచారణ ప్రారంభించిన సీఐడీ అధికారులు.. ఇప్పటికే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో కింగ్ పిన్ కోసం వేట కొనసాగుతోంది.
ఇక మద్యం కుంభకోణంలో అసలు సూత్రదారులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మద్యం స్కామ్‌లో 39వ నిందితునిగా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన సంస్థల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ సంస్థల్లో మరో అనుమానితుడు చంద్రావతి ప్రద్యుమ్న కూడా డైరెక్టర్‌గా కొనసాగుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మరిన్ని సంస్థల్లో సోదాలు నిర్వహించిన సిట్ అధికారులు… ఈ కేసులో సజ్జల భార్గవ రెడ్డి కూడా ఉన్నట్లు సిట్ అధికారులు ఆధారాలతో సహా గుర్తించారు. దీంతో ఇప్పుడు అన్ని వేళ్లు సజ్జల భార్గవ రెడ్డి వైపు చూపిస్తున్నాయి.
Also Read : నాగబాబు ఏమయ్యారు..? పవన్ తో గ్యాప్ వచ్చిందా?
వాస్తవానికి 2019 వరకు సజ్జల పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవి కట్టబెట్టిన జగన్.. కుమారుడు భార్గవ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. ఇక అంతే.. ప్రతిపక్ష నేతలను కించపరిచటమే ఏకైక లక్ష్యం అన్నట్లుగా భార్గవ్ వ్యవహరించారు. చివరికి కుటుంబ సభ్యులపై కూడా అతి నీచమైన పోస్టులు పెట్టే స్థాయికి దిగజారి పోయాడనేది వాస్తవం. దీంతో రెడ్ బుక్‌లో ఫస్ట్ పేరు సజ్జల భార్గవ రెడ్డిదే అనే మాట అప్పట్లో బాగా వినిపించింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో భార్గవ రెడ్డ పేరు బయటకు రావడంతో.. అరెస్టు ఖాయమంటున్నారు వైసీపీ నేతలు.