Saturday, September 13, 2025 01:21 AM
Saturday, September 13, 2025 01:21 AM
roots

భద్రత కోసం జగన్ హైకోర్టుకు వెళ్లడం వెనుక కారణం ఇదేనా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత కొన్ని రోజుల నుంచి ప్రతిపక్ష నేత హోదా కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు 10 శాతం సీట్లు అనేది రాజ్యాంగంలో లేదు అంటూ కూడా కొత్త మాట ఈ మధ్య కాలంలో జగన్ మాట్లాడటం మనం విన్నాం. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే చంద్రబాబు భయపడుతున్నారని అందుకే ఇవ్వడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో మాత్రం రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి హోదాలో పెద్ద పెద్ద మాటలే జగన్ మాట్లాడిన పరిస్థితి.

దీనిపై ఆయన కోర్ట్ కి కూడా వెళ్ళారు. ఇదంతా భద్రత కోసమే అంటూ కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు మాత్రం ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత హోదా భద్రత కోసమే అనే అనుమానాలను నిజం చేస్తూ… ఇప్పుడు అనూహ్యంగా ఆయన న్యాయ మార్గాన్ని నమ్ముకున్నారు. తనకు గతంలో ఉన్న భద్రత కొనసాగించాలని, ప్రస్తుత ప్రభుత్వం తనకు మరమ్మత్తులకు గురైన వాహనాన్ని కేటాయించింది అంటూ ఆయన హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. అసలు ఇప్పుడు ఈ పిటీషన్ ఎందుకు వేసారన్నది చాలా మందిలో అనుమానాలకు వేదిక అయింది.

Also Read : పొన్నూరులో అధికారుల అండతో మరో ‘భూ’దోపిడీ

ప్రతిపక్ష నేత హోదా వచ్చే అవకాశం కనపడటం లేదని అందుకే… మనసులో ఉన్న అసలు విషయాన్ని హైకోర్ట్ మెట్లు ఎక్కి బయట పెట్టారని అంటున్నారు. ఇటీవల విజయసాయి రెడ్డి ఇదే విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిసారని, ఆయన ఇచ్చిన సలహా మేరకే ఈ పిటీషన్ హైకోర్ట్ లో వేసారని అంటున్నారు. భద్రత విషయంలో జగన్ లో భయం ఉందని, ఎలా అయినా ప్రభుత్వం నుంచి భారీ భద్రత పొందాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. మరి దీనిపై హైకోర్ట్ ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్