Tuesday, October 28, 2025 05:28 AM
Tuesday, October 28, 2025 05:28 AM
roots

ఆపరేషన్ సిందూర్ అని ఎందుకు పెట్టారు..?

జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదుల మారణహోమానికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాద క్యాంపులను నామరూపాలు లేకుండా చేసేందుకు పాకిస్తాన్ భూ భాగంలో వైమానిక దళం దాడులు జరిపింది. ఈ దాడుల్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది భారత ఆర్మీ. త్వరలోనే మరిన్ని దాడులు చేసేందుకు కూడా సిద్దమైంది.

Also Read : ఉగ్రవాదుల సరికొత్త ప్లాన్.. కాశ్మీర్ లో హై అలెర్ట్

సరిహద్దుల్లో ఏ విధమైన పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు భారత ఆర్మీ సిద్దంగా ఉందని కేంద్రం ప్రకటించింది. పలు విమానాశ్రయాలను కూడా మూసి వేసింది కేంద్ర విమానయాన శాఖ. ఇక ఈ దాడులకు భారత్.. ఆపరేషన్ సిందూర్ గా నామకరణం చేసింది. ఆపరేషన్ సిందూర్ అనే పేరు వెనుక బలమైన కారణం ఉంది. బైసరాన్ లోయలోని పహల్గామ్ సమీపంలోని హిందువులు పై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రవాదులు పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని హతమార్చారు.

Also Read : ఆపరేషన్ సిందూర్ కు జై కొట్టిన అగ్ర దేశాలు

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. ఈ ఘటనతో అనేక మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోవడం కన్నీరు పెట్టించింది. ఈ దారుణానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టడం వెనుక కారణం ఇదే. “సిందూర్” భార్యగా ఉన్న మహిళ ధరించే పవిత్ర చిహ్నం. పురుషులను టార్గెట్ చేసిన దాడి వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్టైంది. ఈ నేపథ్యంలో, భారత సైన్యం ఆ మహిళలకు న్యాయం చేసేందుకు ఈ దాడులు చేపట్టారు. వారి భర్తల ప్రాణాలను పోగొట్టిన వారిపై ప్రతీకారం తీర్చడంలో భాగంగా ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది ఇండియన్ ఆర్మీ.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్