Saturday, September 13, 2025 01:09 AM
Saturday, September 13, 2025 01:09 AM
roots

చంద్రబాబుతో జూనియర్ భేటీ.. కారణాలు వేరేనా?

ఏపిలో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఒకవైపు వరదలతో ఏపీలో లోని చాలా ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది రాజకీయ నాయకులు, సినిమా రంగంలోని ప్రముఖులు, మిగతా రంగాలకు చెందిన వాళ్లు కూడా వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు తమ వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్ కు సహాయం అందించారు… అందిస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్.. ఏపీలోని వరదల నేపథ్యలో.. సీఎం రిలీఫ్ ఫండ్ కు 50 లక్షలను ప్రకటించారు. దీనిలో భాగంగానే ఈరోజు అమరావతిలోని సెక్రెటెరియట్ కు చేరుకుని చెక్ అందించనున్నట్లు సమాచారాం. మరోవైపు రామ్ చరణ్ కూడా జూనియర్ తో రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ కానుండటం మాత్రం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్, టీడీపీ పార్టీకి అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ మరో పార్టీలోకి వెళ్తున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో.. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయ్యి చాలా రోజులు జైలులో ఉన్నారు. అంతేకాకుండా.. నారాభువనేశ్వరి పట్ల.. గత ప్రభుత్వం వైస్సార్సీపీ అవహేళగా మాట్లాడినగా మాట్లాడిన ఘటనలో చంద్రబాబు కన్నీళ్లను సైతం పెట్టుకున్నారు. అయితే.. ఈ ఘటనల్లో జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్ గానే ఉన్నారు. కనీసం..దీనిపై ఎలాంటి రెస్సాన్స్ ఇవ్వక పోవడం అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది.

Read Also : రసవత్తరంగా మారిన ఒంగోలు రాజకీయం.. పైచేయి ఎవరిది?

గతంలో జూనియర్ 2009 ఎన్నికల సమయంలో.. చంద్రబాబుకు, పార్టీకి ఫుల్ సపోర్ట్ గా ప్రచారం నిర్వంచారు. కానీ ఆ తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. టిడిపి నాయకత్వం మరియు జూనియర్ ఒకరితో ఒకరు ఆంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. కూకట్ పల్లి నుంచి నందమూరి సుహాసినిని పోటీ చేసినప్పుడు కూడా ప్రచారానికి రాలేదు. ఈ క్రమంలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలతోనే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకీ దూరంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది.

కానీ జూనియర్ ఎన్టీఆర్ తన తాత పెట్టిన పార్టీని వదలి మరోపార్టీలోకి వెళ్లనని కూడా పలు మార్లు క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా, నందమూరి బాలకృష్ణ సినిమా రంగంలో యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో జరిగిన కార్యక్రమానికి సైతం.. జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి ఆహ్వానం రాలేదు. దీంతో నందమూరి ఫ్యామీలీ, టీడీపీ పార్టీ రాజకీయాలు తెగ హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల మోక్షజ్ఞ తెరంగేట్రం చేశారు. దీనిపై మాత్రం జూనియర్ రెస్పాండ్ అయ్యారు. మోక్షజ్ఞకు ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్.. చంద్రబాబుతో భేటీకానుడటం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్