Friday, September 12, 2025 03:27 PM
Friday, September 12, 2025 03:27 PM
roots

తోపుదుర్తి సేవలో రాప్తాడు పోలీసులు

వైసిపి అధికారంలో ఉన్న లేకపోయినా సరే పోలీసులు మాత్రం ఆ పార్టీ నేతలకు సేవ చేస్తూనే ఉన్నారు. కొంతమంది పోలీసులు తీరులో మార్పు వచ్చిన మరి కొంతమంది పోలీసులు మాత్రం ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, కీలక నాయకులకు భయపడటం ఆశ్చర్యం కలిగించే అంశం. కొంతమంది వైసీపీ నాయకులు తప్పు చేసిన సరే పోలీసులు అరెస్టు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు మరి కొంతమంది పోలీసులు.

Also Read : షర్మిలకు ఉన్న ధైర్యం జగన్ కు లేదా..?

ఇటీవల సత్యసాయి జిల్లా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరి దీనికి కారణం. గత నెలలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రకాష్ రెడ్డి హడావుడి చేశారు. కుంటిమద్ది హెలికాప్టర్ ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రకాష్ రెడ్డిని అరెస్టు చేస్తున్నామంటూ ఆయన ఇంటికి వెళ్లి సికేపల్లి సిఐ శ్రీధర్ హడావుడి చేశారు.

Also Read :చంద్రబాబును మించిన నేత లేరు.. అమరావతిలో మోడీ ఎమోషనల్ స్పీచ్

కానీ ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులకు సిఐ సమాచారం ఇచ్చారు. కానీ ప్రకాష్ రెడ్డి మాత్రం హైదరాబాదు రోడ్లపై పబ్లిక్ గా తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ ఘటనలో స్థానిక పోలీసులు చిక్కుల్లో పడ్డారు. హైదరాబాదులోనే ప్రకాష్ రెడ్డి ఉన్నా సరే ఆయనను అరెస్టు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల డైరెక్షన్లోనే కిందిస్థాయి పోలీస్ సిబ్బంది నడుచుకుంటున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు. బెయిల్ తెచ్చుకునే అంతవరకు పట్టుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్