Monday, October 27, 2025 10:09 PM
Monday, October 27, 2025 10:09 PM
roots

రంగన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెప్తుంది…?

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షులు ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత అయిదారేళ్ళలో దాదాపు ఆరుగురు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోవడాన్ని ఇప్పుడు పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఇటీవల అభిషేక్ రెడ్డి అలాగే వాచ్మెన్ రంగన్న ప్రాణాలు కోల్పోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, నారాయణ 2019 నుంచి 2024 మధ్య ప్రాణాలు కోల్పోగా.. తాజాగా రంగన్న ప్రాణాలు కోల్పోయాడు.

Also Read : మళ్ళీ దేవినేని వర్సెస్ వంగవీటి.. ఎవరు నిలుస్తారో…?

అత్యంత హై ప్రొఫైల్ హత్య కేసులో ఐదేళ్లలో ఐదారుగురు సాక్షులు ప్రాణాలు కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని పోలీసులు అంటున్నారు. తాజాగా దీనిపై కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అసలు ఈ సాక్షులు ఎందుకు చనిపోతున్నారు.. వీరిలో ఎవరెవరు ఏ ఏ కారణాలతో చనిపోయారు.. ఏ పరిస్థితుల్లో చనిపోయారు.. అనారోగ్య కారణాల వెనుక ఆంతర్యం ఉందా.. ఈ మరణాలన్నింటికీ ఏదైనా లింకుందా అనే దానిపై శాస్త్రీయంగా వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

Also Read : ఎమ్మెల్సీ అభ్యర్ధుల పై చంద్రబాబు సంచలన నిర్ణయం

ఇక గతంలో సిబిఐ విచారణ జరిగిన సమయంలో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కీలక సాక్షిగా ఉన్న దస్తగిరి ప్రస్తుతం ప్రాణభయంతో బతుకుతున్నాడు. దీనితో సాక్షులుగా ఉన్న వారికి అలాగే కొంతమంది నిందితులుగా ఉన్న వారికి భద్రత కల్పించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సిబిఐ ఈ మధ్యకాలంలో పెద్దగా జోక్యం చేసుకున్నట్లు కనపడలేదు. అప్పట్లో సిబిఐ అధికారులపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉండేది.

Also Read : నారా లోకేష్ చొరవతో ప్రజల చేతిలో ప్రభుత్వం

దీంతో సిబిఐ అధికారులు కూడా దూకుడుగా వ్యవహరించడం లేదనే అభిప్రాయం కూడా వినపడింది. ఇక ఇప్పుడు మళ్లీ సిబిఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ప్రాణాలు కోల్పోయిన రంగన్న.. పోస్టుమార్టం రిపోర్ట్ కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగానే ఉన్న రంగన్న.. అస్వస్థతకు గురికావడం ప్రాణాలకు కోల్పోవడం వెనక కారణాలు ఏమున్నాయి.. అనేదానిపై పోలీసులు కూఫి లాగుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్