Saturday, September 13, 2025 01:27 AM
Saturday, September 13, 2025 01:27 AM
roots

ఏపి పోలీసులను వెక్కిరించిన వర్మ…

గత వారం రోజుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీడియా ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసాడు. నేను నా ఎక్స్ అకౌంట్ లో వేల పోస్టులు పెట్టాను, వాటిలో కొన్నింటి వల్ల నలుగురి మనోభావాలు దెబ్బతిన్నాయని ఏడాది తర్వాత స్పందించారు, సంవత్సరం తర్వాత నాలుగైదుగురు ఒకే సారి మేల్కొనడం ఏంటీ? అంటూ ప్రశ్నించారు. వివిధ జిల్లాల్లో నాపై కేసులు పెట్టారు, నా పని వల్ల నేను హాజరుకాలేనని కోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు.

Also Read :వారికి పదవులు ఉన్నట్లా… లేనట్లా…?

నన్ను అరెస్టు చేస్తారని పోలీసులతో కలిసి కొన్ని మీడియా సంస్థలు నా డెన్ కు వచ్చారన్న ఆయన… నేను డెన్ లో లేకపోవడంతో పరారీలో ఉన్నాడని, మంచం కింద దాక్కున్నాడని మీడియా కథలు అల్లిందని నా అరెస్టు గురించి ఏ పోలీసు అధికారి చెప్పలేదు అని చెప్పుకొచ్చాడు. న్యూస్ లేకపోతే న్యూస్ ను సృష్టిస్తున్నారు, నా విషయంలో అదే జరిగిందన్నాడు. సోషల్ మీడియాలో టూమచ్ చేయవద్దంటారు, అది ఎలా చెబుతారు, ఒక కార్టూన్ పోస్టును అనే రకాల కోణల్లో ఆపాదించుకోవచ్చన్నారు. సోషల్ మీడియా కంటే డేంజర్ మేన్ స్ట్రీమింగ్ మీడియా తయారైందని ఎద్దేవా చేసాడు.

Also Read :దందాకు బొంద పెట్టేందుకు రెడీ

మెయిన్ స్ట్రీమింగ్ మీడియాకు లెక్చర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదన్న వర్మ… నన్ను కోడ్ చేస్తూ మెయిన్ స్ట్రీమింగ్ మీడియా కూడా పోస్టులు పెడుతుందన్నాడు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను మొర్రో అంటే పరారీలో ఉన్నాను అంటారు, పోలీసులు ఇంకా వర్మను ఎందుకు పట్టుకోవడం లేదు అన్ని ఎద్దేవా చేసాడు. ప్రభుత్వం మారినా పోలీసులు వైసీపీకి మద్దతుగా పనిచేస్తున్నారని ప్రచారం చేశారన్నాడు. ప్రకాశ్ రాజ్ , నాగార్జున నన్ను దాచిపెట్టారని మీడియా ప్రచారం చేసిందని… పోలీసుల కంటే మీడియానే డిటెక్టివ్ గా మారిందని కామెంట్స్ చేసాడు. కార్టూన్ అనేది వ్యంగ్యంగా చెప్పే ఒక అంశమన్న వర్మ… నా గురించి ఎన్నో రకాలుగా బూతులు తిడుతూ మీమ్స్ పెడతారని అమెరికా లాంటి దేశం కూడా మీమ్స్ ను నియంత్రించలేకపోయిందని… కోర్ట్ ఉత్తర్వుల తర్వాత బయటకు వచ్చి కాలర్ ఎగరేసాడు వర్మ.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్