రెబల్ స్టార్ ప్రభాస్ వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే ఇప్పుడు తర్వాత సినిమాల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. సినిమాలు చేస్తునా వాటిని ఎప్పుడు రిలీజ్ చేస్తాడో అనే క్లారిటీ అభిమానులకు దొరకడం లేదు. సినిమాలపై భారీ అంచనాల ఉండటంతో ఒక్కో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ది రాజా సాబ్ అనే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.
Also Read : కర్ణాటకలో గోరంట్ల మాధవ్.. రక్షణ కల్పిస్తోంది ఎవరూ…?
కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. ముందు సినిమాను మార్చిలో రిలీజ్ చేస్తారని ప్రకటించారు.. ఆ తర్వాత ప్రభాస్ కాలికి గాయం కావడంతో సినిమా షూటింగ్ కాస్త లేట్ అయింది. దీనితో వేసవిలో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. మే నెలలో పక్కాగా సినిమా రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని.. ప్రభాస్ పోర్షన్ దాదాపు పది రోజులు పాటు పెండింగ్ పడిందని వార్తలు వస్తున్నాయి.
Also Read : జగన్ పై నమ్మకం లేదా…? సీరియస్ గా తీసుకోని లీడర్లు
ఒక పాటతో పాటుగా కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయాల్సి ఉందని.. అలాగే ఒక గెస్ట్ రోల్ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నటిస్తున్నారని, ఆయనతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సిన అవసరం ఉందని, దాదాపుగా ఈ సినిమా మే చివరిలో లేదంటే జూన్ మొదటి వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్.. సలార్ సిక్వెల్ అలాగే స్పిరిట్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా, కల్కీ 2 చేస్తున్నాడు. మొత్తం ప్రభాస్ చేతిలో 8 సినిమాలు ఉన్నాయి. ఎనిమిది సినిమాలు రాబోయే మూడు నాలుగేళ్లలో రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న సరే ఆ సినిమాలు మాత్రం ముందుకెళ్లడం లేదు.




