దేశ రాజకీయాల్లో వారసత్వం అనేది ఎప్పుడూ హాట్ టాపిక్. ప్రముఖ రాజకీయ నాయకుల వారసులు ఎక్కువగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వారసత్వం కాస్త ఎక్కువగా ఉంది. చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు దాదాపుగా తమ వారసులను పరిచయం చేస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ వారసులను ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్యేలను చేసుకున్నారు. త్వరలోనే ఒకరిద్దరు అడుగుపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
Also read : లేట్ అయినా పర్వాలేదు.. మంత్రి పదవి ప్లీజ్
తాజాగా మరో పేరు వినపడుతోంది. అదే వైఎస్ రాజారెడ్డి.. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న షర్మిల తన కొడుకుని రాజకీయాలకు పరిచయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్టు సమాచారం. తాజాగా కర్నూలు ఉల్లి మార్కెట్ కు తన కొడుకుతో కలిసి వెళ్ళారు షర్మిల. వెళ్ళే ముందు వైఎస్ విజయమ్మ ఆశీస్సులు కూడా తీసుకున్నారు రాజారెడ్డి. దాదాపు రెండేళ్ళ నుంచి రాజారెడ్డి పేరు రాజకీయాల్లో ఎక్కువగా వినపడుతోంది.
Also read : ఆ విషయంలో టీడీపీ ఫెయిల్ అయినట్లే..!
స్పెషల్ ఫ్లైట్ లో తల్లితో కలిసి దిగిన రాజారెడ్డి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పెళ్లిని కూడా వైఎస్ షర్మిల ఘనంగా చేసారు. పలువురు రాజకీయ ప్రముఖులను కూడా ఆమె ఆహ్వానించారు. హీరో కటౌట్ కావడంతో సోషల్ మీడియాలో మంచి వెయిట్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ లో తల్లితో కలిసి ఉంటున్న రాజారెడ్డి.. త్వరలోనే ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నాయి మీడియా వర్గాలు. వచ్చే ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు సైతం వినపడుతున్నాయి.




