Tuesday, October 28, 2025 07:31 AM
Tuesday, October 28, 2025 07:31 AM
roots

ఆయనకే ఎందుకు అవకాశం సార్…?

రాజ్యసభ అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పార్టీలో లేని వ్యక్తిని పెద్దల సభకు పంపుతున్నారు. ఆయన ఎవరో కాదు.. బీసీ నేతగా గుర్తింపు పొందిన ఆర్.కృష్ణయ్య. ఇదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి… అధికారం కోల్పోయిన వెంటనే జంప్ అయ్యారని ఇప్పటికే ఆర్.కృష్ణయ్య పైన విమర్శలున్నాయి. వాస్తవానికి ఆర్.కృష్ణయ్య ప్రస్తుతం ఏ పార్టీలో లేనప్పటికీ.. అన్నీ పార్టీలు నావే అనేలా ఓ రౌండ్ వేసేశారు. బీసీ సంఘ నేతగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్.కృష్ణయ్య ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

Also Read: జగనన్న… మరో చెల్లి కూడా పోతున్నారన్నా…!

2018 ఎన్నికల్లో తెలంగాణలో సీఎం అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆర్.కృష్ణయ్య ఓడిపోయారు. దీంతో కొద్ది రోజులు సైలెంట్ అయ్యారు. అయితే దాదాపు ఆరు నెలల పాటు ఏపీలో అధికార పార్టీ నేతగా చలామణి అయిన సదరు బీసీ నేత… 2019 ఎన్నికల సమయంలో కనీసం టీడీపీ తరఫున ఒక్క అభ్యర్థి గెలుపు కోసం కూడా ప్రచారం చేయలేదు. ఇక 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ గెలవడంతో… ఇంటిపై నున్న పసుపు జెండా పీకేసి… జై జగన్ అంటూ జెండా మార్చేశారు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్‌, ఏపీలో వైసీపీ నేతలకు చాలా సన్నిహితంగా తిరిగారు తప్ప… బీసీల కోసం ఐదేళ్ల పాటు ఏ ఒక్క లబ్ది చేయలేదు. వైసీపీ ఐదేళ్ల పాలనలో బీసీలపై ఎన్నో దాడులు జరిగాయి.

Also Read: మనోజ్ ను ఇంత దారుణంగా కొట్టారా…? గోళ్ళతో గీరింది ఎవరు…?

వైసీపీ ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ నిధులు పక్కదారి పట్టాయి. ఇంకా చెప్పాలంటే బీసీ కులాలకు కార్పొరేషన్లు కేటాయించినప్పటికీ… కనీసం ఒక్క దానికి కూడా ఫలానా పని చేసిన దాఖలాలు లేవు. అయినా సరే… ఆర్.కృష్ణయ్య మాత్రం నోరెత్తలేదు. పైగా జగన్‌ను మెప్పించి ఏకంగా రాజ్యసభ సభ్యత్వం కొట్టేశారు. ఏపీలో మాట్లాడకపోయినా… పార్లమెంట్‌లో బీసీల కోసం పోరాటం చేస్తారేమో అని బీసీలంతా భావించారు. కానీ అవన్నీ అడియాశలే అయ్యాయి. చివరికి కేంద్రం నుంచి ఏపీకి వస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని… పెద్దల సభలో టీడీపీ సభ్యులు ఆరోపించినా సరే… ఆర్.కృష్ణయ్య ఏం మాట్లాడలేదు.

Also Read: అలా ఎలా అవకాశం ఇస్తారు సర్..!

ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మరోసారి తనలోని బీసీ నేతను పక్కన పెట్టి రాజకీయ వేత్తను బయటకు తీశారు. మళ్లీ వైసీపీ జెండా పక్కన పడేశారు. అయితే ఈసారి మాత్రం ఏ పార్టీలో చేరలేదు. అందరూ టీడీపీలో, జనసేనలో చేరతారని ఊహించారు. కానీ ఆర్.కృష్ణయ్య మాత్రం నోరెత్తలేదు. చాప కింద నీరులా మంతనాలు సాగించారు. ఎప్పుడు కలిశారో తెలియదు.. ఎక్కడ కలిశారో తెలియదు కానీ… రాజ్యసభ సభ్యుల జాబితాలో ఏపీ నుంచి తన పేరు ఉండేలా చూసుకున్నారు. ఇప్పుడు ఇదే విషయం ఏపీ బీజేపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Also Read: పవన్ పై వైసీపీ సానుభూతి వల.. సాయిరెడ్డి గేమ్ స్టార్ట్..!

అలా ఎలా అవకాశం ఇస్తారని కమలం పార్టీ పెద్దలపై విమర్శలు చేస్తున్నారు. ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకున్న నేతలను కాదని… అసలు సభ్యత్వం లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారని నిలదీస్తున్నారు. నిన్నటి వరకు కేంద్రాన్ని తిట్టిన పార్టీ నేతకు ఇప్పుడు ఎలా అవకాశం ఇచ్చారంటున్నారు. కమలం పార్టీలో ఎంతో మంది బీసీ నేతలు ఉన్నారు. వారి కంటే ఆర్.కృష్ణయ్య మీకు ఎక్కువయ్యాడా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తిని రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక మంతలబు ఏమిటో కమలం పార్టీ పెద్దలే చెబితేనే ఈ వివాదానికి పరిష్కారం దొరుకుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్