Friday, September 12, 2025 11:21 PM
Friday, September 12, 2025 11:21 PM
roots

చీరతో అడ్డంగా దొరికిపోయిన ప్రజ్వల్..!

2024 ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవన్న వ్యవహారంలో ఇటీవల కోర్ట్ జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఏడాదికి పైగా విచారణ జరిగిన ఈ కేసులో మాజీ ఎంపీని కోర్ట్ దోషిగా గుర్తించింది. మైసూరులో 47 ఏళ్ల ఇంటి పని మనిషిపై అతను దారుణానికి పాల్పడ్డాడు. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. పక్కా ఆధారాలను కోర్ట్ కు సమర్పించారు. ఆ ఘటనను అతను రికార్డ్ కూడా చేయడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

Also Read : సుందర్ పై ఆసిస్ దిగ్గజాల ప్రశంశలు..!

ఈ నెల 2న అతనికి కోర్ట్ జీవిత ఖైదు విధించింది. అలాగే 11 లక్షల జరిమానా కూడా విధించి, ఆ జరిమానా బాధితురాలికి ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అత్యంత కీలక ఆధారంగా చీరను గుర్తించారు పోలీసులు. బాధితురాలిపై దారుణానికి పాల్పడిన తర్వాత, ఆమె చీరను బలవంతంగా లాక్కున్నాడు ప్రజ్వల్. ఆ చీరను నాశనం చేయడం మర్చిపోయి, ఇంట్లో అటకపై పెట్టాడు. సోదాల్లో ఆ చీరను గుర్తించారు పోలీసులు. విచారణలో.. అతని వీర్యంతో పాటుగా డియెన్ఏ నమూనాలు ఆ చీరపై ఉన్నట్టు గుర్తించారు.

Also Read : పోర్టబుల్ ఏసీ.. త్వరలో ఇండియాకు ఎంట్రీ..?

బాధితురాలి డియెన్ఏ కూడా చీరపై ఉందని గుర్తించి.. అతడే నిందితుడు అని తేల్చాడు. దర్యాప్తులో, దాడి జరిగిన సమయంలో ఆమె ఏమి ధరించిందో పోలీసులు ఆరా తీసారు. అప్పుడు ప్రజ్వల్ తన చీరను తిరిగి ఇవ్వలేదని, అది ఇప్పటికీ ఫామ్‌హౌస్‌లోనే ఉండవచ్చని ఆమె వెల్లడించింది. ఆ తర్వాత సోదాలు చేసిన పోలీసులు.. వెంటనే ఆ చీరను గుర్తించారు. దానిని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపి.. ఆ తర్వాత ప్రజ్వల్ రక్త నమూనాలను కూడా తీసుకుని విచారించారు. అక్కడ రెండూ మ్యాచ్ అయినట్టు గుర్తించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్