Tuesday, October 28, 2025 02:25 AM
Tuesday, October 28, 2025 02:25 AM
roots

పోసాని రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

వైసీపీ హయాంలో రెచ్చిపోయిన సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విషయంలో పోలీసులు పక్కా ఆధారాలతో రంగంలోకి దిగారు. ఇన్నాళ్ళు ఆయన్ను చూసి చూడనట్టు వదిలేసిన పోలీసులు… ఇప్పుడు మాత్రం పక్కాగా రంగంలోకి దిగారు. పోసాని కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ రైల్వే కోడూరు న్యాయస్థానం ‌ఉత్తర్వులు ఇచ్చింది. మొన్న రాత్రి 9 గంటల నుంచి నిన్న తెల్లవారజామున 6 గంటల వరకు విచారణ జరిగింది. ఇక పోసాని రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలను పోలిసులు పేర్కొన్నారు.

Also Read : పండుగనాడు కూడా ప్రాంతీయ విద్వేషమేనా కవితక్కా..?

ప్రముఖ సినీనటుడి కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడారని ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడంతో పాటు ప్రముఖ నటుడి ప్రతిష్టకు విఘాతం కలిగించారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తి గత జీవితంపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. తన కుమారులకు దళితులతో ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయననీ ఎలాంటి సంబంధాలు కుదుర్చుకోనని దారుణంగా మాట్లాడారని పేర్కొన్నారు.

Also Read : వంశీ అరెస్ట్ పై పోలీసులు సంచలన కామెంట్స్

దళితుల్ని కించపరిచేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారని కోర్ట్ కు వివరించారు. రాజకీయ నాయకుల్ని, వారి కుటుంబాల్లోని మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని పోసాని కృష్ణమురళి పై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులున్నాయని పేర్కొన్నారు పోలీసులు. పోసానికి రిమాండు విధించకుండా వదిలేస్తే విచారణ కష్టమవుతుందని కోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. పోసాని సినీ రంగానికి చెందినవారు కావడంతో ఆయన మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయని బహిరంగంగా,సమాజంలో విభజన తీసుకొచ్చేలా పోసాని వ్యాఖ్యలు చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందు పరిచారు. పోసానికి రిమాండు విధించకపోతే ఇవే నేరాల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తారని.. అలాగే తమకు విచారణలో ఆయన సహకరించలేదని పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్