Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

పొన్నవోలు దెబ్బకి పరేషాన్ లో వైసీపీ

వైసీపీ నేతలను అరెస్టు చేయడమేమో గాని.. వాళ్ళను అరెస్టు చేసిన తర్వాత మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేస్తున్న హడావుడి మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఎవరిని అరెస్టు చేసిన సరే ఎక్కడికైనా.. వెంటనే వెళ్ళిపోతున్న సుధాకర్ రెడ్డి వాళ్ళను ఎలాగైనా బయటకు తీసుకురావాలని తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. న్యాయస్థానాల ముందు బలమైన వాదనలు వినిపించేందుకు కూడా ఆయన.. ఏకంగా తనకింద 20 మంది లాయర్లను పెట్టుకొని మరీ వెళుతున్నారు.

Also Read : జగన్‌కు ఝలక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ..!

అయితే ఇప్పుడు ఆయన వాదించిన కేసుల్లో ఒక్కరికి కూడా బెయిల్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ తరపున ఆయన వాదనలు వినిపించగా.. ఆయనకు కోర్టు ముందు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత నందిగం సురేష్ మూడు నెలలకు గాని బయటికి వచ్చారు. ఇటీవల గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. వంశీ తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. వంశీని ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు కష్టపడ్డారు.

Also Read : మార్చొద్దు.. ఏపీ బిజేపి చీఫ్ పై చంద్రబాబు ఒపినియన్…!

కానీ చివరకు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక తాజాగా సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయనకు కూడా తాజాగా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనితో ఆయనపై వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. దయచేసి ఎవరి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించవద్దని.. అవసరమైతే మరో లాయర్ ను.. అరెస్ట్ అయిన వాళ్ళు నియమించుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. అటు కొంతమంది వైసిపి కార్యకర్తలు తరఫున కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను వినిపించారు. వారు కూడా ప్రస్తుతం జైల్లోనే ఉండటం కొసమెరుపు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక కేసు తర్వాత మరో కేసు పెట్టి.. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేస్తున్నారని పొన్నవోలు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్