Sunday, September 14, 2025 03:37 AM
Sunday, September 14, 2025 03:37 AM
roots

పొంగులేటి లీక్స్… బీఆర్ఎస్ అగ్రనేత అరెస్ట్

“ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్‌ బాంబులు పేలబోతున్నాయి. ప్రధాన నేతలకు పెద్ద షాక్‌ ఇవ్వబోతున్నాం. ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, ధరణి వంటి సుమారు 8 నుంచి 10 ప్రధాన అంశాల్లో చర్యలు ఉంటాయి. ఇందుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలతో ఫైళ్లు కూడా సిద్ధం చేసాం. సియోల్‌ నుంచి హైదరాబాద్‌ చేరేలోపే ఈ చర్యలు ప్రారంభమవుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ దాదాపు పూర్తయింది. మొత్తానికి ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరం, ధరణి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి చర్యలు లేవని ప్రజలు భావించవద్దు.”

తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటనలో ఓ తెలుగు మీడియాతో చేసిన కామెంట్స్ ఇవి. ఏపీలో జగన్ హడావుడిలో ఉన్న మీడియా ఈ కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోలేదు గాని తెలంగాణాలో ఏం జరగబోతుంది అనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. అసలు అరెస్ట్ లు ఎవరివి ఉండవచ్చు అనే దానిపైనే చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ అగ్ర నేతను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. నలుగురు మాజీ మంత్రులను కూడా అరెస్ట్ చేయనున్నట్టు సమాచారం.

Also Read : బీఆర్ఎస్ పని అయిపోయిందా?

దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక అధికారులు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ కు చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేయనున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ ఊపందుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో విచారణ ఇప్పటికే వేగవంతం అయింది. జస్టీస్ ఘోష్ ఈ విచారణకు సారధ్యం వహిస్తున్నారు. అధికారుల నుంచే ఎక్కువ సమాచారాన్ని ఆయన రాబట్టారు. దీనితో ఏం జరగబోతుంది అని ఇప్పుడు బీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్