ఏపీలో ఇప్పుడు అదాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం అదాని గ్రూప్ భారీగా లంచాలు ఇచ్చినట్టు అమెరికాలో కేసు నమోదు కావడంతో అదాని లక్ష్యంగా ఇప్పుడు విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఈ కేసులో జగన్ కూడా ఉన్నారనే వార్తల నేపధ్యంలో వైసీపీ కవరింగ్ కు దిగింది. నిన్న పేర్ని నానీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు తాము అధానితో ఏ విధమైన ఒప్పందాలు చేసుకోలేదని చెప్పే ప్రయత్నం చేసారు. అధానితో చంద్రబాబు మాత్రమే ఒప్పందాలు చేసుకున్నారని, తప్పంతా చంద్రబాబుది మాత్రమే అన్నట్లు మాట్లాడారు.
Also Read : ప్రేమ పెళ్ళిళ్ళకి సిద్దమైన టాలీవుడ్ టాప్ యాక్టర్స్ వీళ్ళే
ఇదే టైం లో ఓ వీడియో వైరల్ అయింది. జగన్ అనకాపల్లిలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో అదాని సంస్థలు తమ ముఖం చూసి పెట్టుబడి పెట్టారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు టైంలో అసలు రాష్ట్రంలో అదానీ అడుగు పెట్టలేదన్నారు. పేర్ని నానీ ప్రసంగించిన కాసేపటికే టీడీపీ సోషల్ మీడియా ఈ వీడియో వైరల్ చేసింది. ఒక్కసారి గతం చూస్తే… ఏపీలో ఉన్న పోర్ట్ లు, విద్యుత్ ఒప్పందాలు అన్నీ కూడా అదాని సంస్థలతో ఒప్పందం చేసుకున్నవే. బందరు, కృష్ణపట్నం ఇలా కీలక పోర్ట్ ల విషయంలో అదానితోనే జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. పోర్ట్ లో రాష్ట్ర వాటా అత్యంత చౌకగా ఆదానీకి కట్టబెట్టినట్లు అప్పటి విపక్ష టిడిపి నాయకులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read : కంగారులను కంగారు పెట్టేసారు… చుక్కలు చూపించిన పేస్ త్రయం
పలు మార్లు అప్పుడు అదాని రాష్ట్రానికి కూడా వచ్చి వెళ్ళారు. నేరుగా జగన్ ఇంటికి కూడా వెళ్ళారు అదాని. ఇవన్నీ ప్రజలకు తెలిసినా తాము ఏ పాపం చేయలేదు అన్నట్టు జగన్ మాట్లాడటం… దాన్ని పేర్ని నానీ వంటి వారు కవర్ చేయడం అన్నీ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక అదాని వ్యవహారంలో జగన్ నే ఇక్కడ అందరూ కార్నర్ చేస్తున్నారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ కు మేలు జరిగింది అనే విషయంలో ఆయా డాక్యుమెంట్ లు చూస్తే క్లియర్ గా అర్ధమవుతుంది. అదానీ తో జగన్ సమావేశాలు అన్నీ కూడా వ్యక్తిగతంగా జరిగినవే తప్ప బృందంగా జరిగినవి ఏవీ లేవనే చెప్పాలి. వారిద్దరి మధ్య డీల్ కుదిరింది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.




