ఏపీలో ప్రభుత్వంపై వైసీపీ గత నాలుగు నెలలుగా తీవ్ర స్థాయిలో తప్పుడు ఆరోపణలు చేస్తూ వస్తోంది. పలు అంశాలను టార్గెట్ గా చేసుకుని ప్రజల్లో.. ప్రభుత్వాన్ని చులకన చేసి మాట్లాడే ప్రయత్నాలు చేస్తోంది. ఏదైనా ఘటన జరిగిన ప్రతీసారి.. చంద్రబాబును అలాగే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పదే పదే వైఎస్ జగన్ విమర్శలు చేయడం, వాటిని వైసీపీ అనుకూల మీడియా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే టీడీపీ నేతలు వీటిపై ఎంత వరకు కౌంటర్ ఇస్తున్నారు అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. టిడిపిలో అతి కొద్దిమంది నాయకులు మాత్రమే వైసీపీ తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొడుతూ టిడిపి గొంతుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
Also Read : బిజెపి తెలంగాణా అధ్యక్షుడు ఆయనేనా..? రేపే ఎంపిక..!
అయితే చాలా మంది టిడిపి నాయకులు జగన్ మనస్తత్వానికి భయపడో, వారితో ఉన్న వ్యాపార సంబంధాల వలనో లేక లాలూచీ స్వభావమో కానీ జగన్ కి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడే ప్రయత్నం ఈ మధ్య కాలంలో చేయలేదు. కానీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళే విధంగా జగన్ విమర్శలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు జోష్ లో ఉన్నారు. ఇటీవల నాగ మల్లేశ్వరరావు అనే వైసీపీ నాయకుడు బెట్టింగ్ లతో అప్పులపాలై బలవన్మరణం చెందిన వ్యక్తిని జగన్ పరామర్శించి, తన విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించిన తర్వాత పెమ్మసాని మీడియాతో మాట్లాడారు. అసలు జగన్ రోడ్ల మీదకు వస్తే రాష్ట్రానికి నష్టం తప్పించి లాభం లేదని మండిపడ్డారు పెమ్మసాని. జగన్ ఇంట్లో ఉంటేనే రాష్ట్రానికి మంచిది అన్నారు.
Also Read : కేఆర్‌పీఎస్‌కి తాత్కాలిక బ్రేక్..!
ఈ సందర్భంగా జగన్ బయటకు వచ్చిన సందర్భంగా జరిగిన నష్టాలను సైతం ప్రజలకు వివరించారు. ఇక వైసీపీ కార్యకర్తలు చేసిన కొన్ని ఘాతుకాలను, చంద్రయ్య మరణం వంటి అంశాలను కూడా పెమ్మసాని వివరిస్తూ జగన్ పై ఘాటు విమర్శలు చేసారు. వైసీపీ ఆడే డ్రామాలు ఆపకపోతే రాష్ట్రం ఇంకా వెనక్కు వెళ్ళిపోతుంది అని, అభివృద్ధికి కూడా వైసీపీ, ఆ పార్టీ అధినేత వ్యతిరేకం అంటూ పెమ్మసాని విమర్శించారు. ఈ విమర్శలకు సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన వచ్చింది. ఒక వైపు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూనే, మరోవైపు జగన్ చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇతర టీడీపీ నేతలు కూడా ఇదే స్థాయిలో విమర్శలు చేయగలిగితే వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడతారని టీడీపీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.