ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి మరింతగా పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ప్రస్తుతం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికను ఆ పార్టీ అధిష్టానం పూర్తి చేసింది. దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ఈ విషయంలో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజకీయంగా బిజెపి బలహీనంగా ఉన్నా సరే రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక మాత్రం చర్చినియాంశంగా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ఎంపీగా ఉండటంతో మరో నేతకు ఆ పదవిని అప్పగించాలని ఆ పార్టీ అధిష్టానం ఎప్పటినుంచో భావిస్తోంది.
Also Read : ఏం చేసుకుంటావో చేసుకో.. ట్రంప్ కు మస్క్ వార్నింగ్
అందరూ అనుకుంటున్నట్లుగానే పివిఎన్ మాధవ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక త్వరలోనే జనసేన పార్టీ కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎంపికను పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. తెలంగాణలో ఆ పార్టీ పోటీ చేయాలంటే ఖచ్చితంగా జాతీయ పార్టీ హోదా కావలసి ఉంటుంది. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలకు అధ్యక్షులను ప్రకటించి తాను జాతియ అధ్యక్షుడిగా ఉండాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
Also Read : ఎవరు ఎవర్నీ మోసం చేశారు..?
పార్టీ నాయకత్వం కూడా ఎప్పటినుంచో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో పార్టీ వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. దీంతో అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను మరో నాయకుడికి అప్పగించాలని పవన్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి అలాగే బిజెపికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికను పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసేందుకు పవన్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.